
గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వ హయాంలో దళితుల అణచివేత ఎక్కువ అయిందని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి సంకుచితవాదంతో విద్వేషకర వాతావరణం నెలకొంది. దళితులు, ఆదివాసీ వర్గాలపై దాడులు , వారిపట్ల వివక్ష పెరుగుతోందని అన్నారు. గుజరాత్‌కు చెందిన దళితులు, ఆదివాసీలతో తాను ఇటీవల మాట్లాడినప్పుడు , వారి సాధకబాధకాలు తెలిసివచ్చాయని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. వారి సాధకబాధకాలను తెలియచేయాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.
2016 ఉన్నా దారుణ ఉదంతం బాధితుల పట్ల తాము పూర్తిగా సంఘీభావం వ్యక్తం చేస్తున్నామని, వారికి పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తనను కలిసిన బాధితులలో ఉన్న దళితులు కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్ దళితులతో తాను మాట్లాడినప్పుడు వారి కష్టాలు నష్టాల గురించి ఎంతో అవగావహన కల్గింది. వారి బాధలు ఆందోళన కల్గించాయని రాహుల్ తెలిపారు. వారికి న్యాయం కోసం మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని గుర్తించానని పేర్కొన్నారు.