Reading Time: < 1 minute

వార్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా.. పెట్రోల్ కష్టాలే అనుకుంటే కండోమ్స్ కొరత కూడానా!

Caption of Image.

టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం కారణంగా కండోమ్ల తయారీకి అవసరమైన ముడిసరుకుల సరఫరా నిలిచిపోవడంతో, వాటి ఉత్ప త్తి గణనీయంగా పడిపోయింది. తయారీలో లూబ్రికేషన్ కోసం వాడే సిలికాన్ ఆయిల్ కొరత ఏర్పడడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 

దీనికి తోడు కండోమ్ చిరిగిపోకుండా ఉండటానికి ఉపయోగించే అమ్మోనియా ధరలు 40 శాతానికి పైగా పెరగడం తయారీదారులకు పెను భారంగా మారినట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాలుగా గల్ఫ్ దేశాల నుంచే అమ్మోనియా దిగుమతి అవుతుంది. 

అయితే హార్ముజ్ జలసంధి మూసివేతతో రవాణా నిలిచిపోయి సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ముడిసరుకుల ధరలు పెరగడం, రవాణా ఇబ్బందుల వల్ల రానున్న రోజుల్లో కండోమ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

►ALSO READ | పసిపిల్లల ప్రాణాలు తీసింది వీళ్లే.. యూఎస్ అధికారుల ఫొటోలు బయటపెట్టిన ఇరాన్

©️ VIL Media Pvt Ltd.