Reading Time: 2 minutes
Instagram Offline Reels Feature Watch Reels Without Internet Soon

Instagram Offline Reels: ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్న సమయంలోనో లేదా సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతంలో ఉన్నప్పుడో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే.. రీల్స్ లోడ్ అవ్వక తెగ బాధ పడిపోతుంటారు. కేవలం ఖాళీ స్క్రీన్ మాత్రమే కనిపిస్తూ మనల్ని నిరుత్సహ పెడుతుంది. అయితే ఈ సమస్యకు త్వరలోనే చెక్ పెట్టేందుకు ‘మెటా’ (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ సిద్ధమవుతోంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా రీల్స్ చూసేలా సరికొత్త ‘ఆఫ్‌లైన్ రీల్స్’ ఫీచర్‌ ను సంస్థ పరీక్షిస్తోంది.

Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త సుమీ!

ఇందుకు సంబంధించిన విషయాలను ఓ ప్రముఖ మొబైల్ డెవలపర్, టిప్‌స్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన స్క్రీన్‌ షాట్‌ల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ఒక ఆటోమేటిక్ డౌన్‌ లోడ్ సిస్టమ్‌ పై ఇప్పుడు పనిచేస్తోంది. ఇది మీ ఆసక్తికి తగ్గట్టుగా కొన్ని రీల్స్‌ ను ముందే డౌన్‌లోడ్ చేసి ఉంచుతుంది. దీనితో డేటా లేని సమయంలో కూడా మీరు వినోదాన్ని అందుకోవచ్చు. ఈ కొత్త అప్డేట్‌ లో వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఇచ్చేలా కొన్ని ఆప్షన్లను ఇన్‌స్టాగ్రామ్ రూపొందించింది.

ఇందులో మీరు వై-ఫైలో ఉన్నప్పుడు రీల్స్‌ను ఆటోమేటిక్‌గా సేవ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అయితే ముఖ్యంగా మీ ఫోన్ స్టోరేజ్ నిండిపోకుండా ఉండేందుకు.. మీరు ఎన్ని వీడియోలను డౌన్లోడ్ చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు 10, 30, లేదా 50 రీల్స్‌ వరకు లిమిట్ సెట్ చేసుకునే అవకాశం ఉండబోతోంది. అంతేకాకుండా వీటికోసం మీ మొబైల్ డేటా వృథా కాకుండా కేవలం వై-ఫై ఉన్నప్పుడే డౌన్‌లోడ్ అయ్యేలా సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ లో ఉన్నప్పుడు ఈ వీడియోలను మీ సాధారణ ఫీడ్‌లో లేదా ప్రత్యేకంగా ఉండే ‘డౌన్‌లోడ్స్’ సెక్షన్ ద్వారా చూసుకోవచ్చు. (అచ్చం యూట్యూబ్ మాదిరి). ఇప్పటికే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌ లలో ఉన్న ‘స్మార్ట్ డౌన్‌లోడ్స్’ తరహాలోనే ఈ ఫీచర్ పనిచేయనుంది.

Chairman’s Desk : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ పెను మార్పులు తెస్తుందా?

ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకసారి పరీక్షలు పూర్తయ్యాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డేటా కనెక్టివిటీ సమస్యలు ఎదుర్కొనే మన దేశం వంటి ప్రాంతాల్లో ఈ ఫీచర్ రీల్స్ ప్రియులకు ఒక పెద్ద వరం అనే చెప్పాలి.