Reading Time: < 1 minute
Why Suryakumar Yadav Impact Sub Mi Vs Kkr Ipl 2026 Jayawardene Reaction

Suryakumar Yadav: నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), ముంబై ఇండియన్స్(MI) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ముంబై తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీమిండియా టీ20 కెప్టె్న్ సూర్యకుమార్ యాదవ్‌ను ఇంపాక్ట్ సబ్ జాబితాలో చేర్చారు. కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, రాజ్ బావా, అశ్వనీ కుమార్‌లతో పాటు ఇంపాక్ట్ సబ్ జాబితాలో సూర్యను చేర్చడం అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన విషయాన్ని గుర్తు చేశారు. “టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది. సూర్యకుమార్ శారీరకంగా కొంత విశ్రాంతి కోరుకున్నారు. దయచేసి లేనిపోని కథలు సృష్టించకండి, మా క్యాంప్ అంతా చాలా సంతోషంగా ఉంది. సూర్యకు గ్రోయిన్ (Groin) భాగంలో స్వల్పంగా పట్టేసినట్లు అనిపించడంతో, ముందు జాగ్రత్తగా అతనికి మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తదుపరి మ్యాచ్‌కి మాకు ఐదు రోజుల విరామం ఉంది కాబట్టి, అతను పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం ఉంది. సూర్య మాకు అత్యంత విలువైన ఆటగాడు, అందుకే అతని విషయంలో ఈ లెక్కలతో కూడిన నిర్ణయం తీసుకున్నాం” అని మహేల స్పష్టం చేశారు.

READ MORE: Stock Market: యుద్ధ భయం.. భారీ నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు

గత సీజన్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించిన విషయం తెలిసిందే. తాజాగా సూర్యకుమార్‌ను అలాగే తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టారు. ఇక నిన్న జరిగిన ఛేజింగ్‌లో సూర్యకుమార్ కేవలం 8 బంతుల్లో 16 పరుగులు చేసి తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, ముంబైకి ఆ లోటు తెలియలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (78) మరియు ర్యాన్ రికెల్టన్‌ల రికార్డు భాగస్వామ్యం (148 పరుగులు) పిచ్‌పై విధ్వంసం సృష్టించడంతో 221 పరుగుల భారీ లక్ష్యం కూడా ముంబైకి చిన్నదిగా అనిపించింది. మరోవైపు.. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అటు ఆర్‌సీబీ తరపున విరాట్ కోహ్లీ, ఇటు ముంబై తరపున రోహిత్ శర్మ తమ పాత ఫామ్‌ను అందిపుచ్చుకోవడం లీగ్‌కు కొత్త ఊపునిచ్చింది.