ముందుగా మటన్ బోటి తీసుకుని దానిని బాగా వేడి నీటితో కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 15 నిమిషాల పాటు ఉంచి మటన్ ను నానా బెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక దానిలో ఉల్లిపాయలు వేసి బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గితే టెస్ట్ గా ఉంటుంది.
ఆ తర్వాత ఒక టేబుల్ వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. వెల్లుల్లి వాసన వచ్చే వరకు వేయిస్తే కూరకు మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు మటన్ బోటి ముక్కలు వేసి వాటిలో వేసి వేయించాలి. ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ గరం మసాలా పొడి, రుచికి తగినంత వేసి మసాలా వేసి వేయించాలి.
ఇప్పుడు రెండు గ్లాస్ లు నీళ్లు కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీదే ఉడికించాలి. మటన్ బోటి మెత్తగా ఉడికితే కర్రీ రుచిగా ఉంటుంది.చివర్లో కుక్కర్ మూత తీసి అర కట్ట కొత్తిమీర చల్లి దించి గార్లిక్ మటన్ బోటి కూరను వేడి అన్నంలో తింటే టేస్టీ టేస్టీగా ఉంటుంది.




