Reading Time: < 1 minute

తెలంగాణ టూరిజం ఎండీగా గౌతమి

Caption of Image.
  •     అదనపు బాధ్యతలిస్తూ జీవో  
  •     ప్రసూతి సెలవులో వెళ్లనున్న  ప్రస్తుత ఎండీ క్రాంతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రసూతి సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శనివారం జీవో విడుదల చేసింది. ఏప్రిల్ 1వ నుంచి జులై 31వ వరకు వల్లూరు క్రాంతి సెలవులో ఉంటారు.ఆమె సెలవులో ఉన్న సమయంలో టీజీటీడీసీ ఎండీగా పి. గౌతమికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 

పి. గౌతమి ప్రస్తుతం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సెలవు కాలం ముగిసిన తర్వాత వల్లూరు క్రాంతి తిరిగి పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

©️ VIL Media Pvt Ltd.