
ఉద్యోగం చేసి విసిగిపోయిన చాలామంది ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేయాలని అనుకుంటారు. సరిగ్గా అలాంటివారి కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఉన్న ఊరిలోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించవచ్చు. వివరాల్లోకి వెళ్తే.! నేటికాలంలో స్వచ్ఛమైన, ఆర్గానిక్ ఆహారానికి గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. గ్రామాల్లో సహజ సిద్ధంగా పెరిగే నాటుకోళ్లు, గొర్రెలు, మేకల పెంపకాన్ని ఒక బిజినెస్ మోడల్‌గా మార్చడమే ఈ ఐడియా. పట్టణాల్లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉండి, సరైన అవకాశం కోసం చూసేవారు.. గ్రామాల్లోని రైతులతో కలిసి ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. రైతులకు పెట్టుబడి ఇచ్చి, గొర్రె పిల్లలు లేదా నాటుకోళ్లను కొనిచ్చి పెంచమని అప్పగించడం ద్వారా ఇద్దరికీ లాభం చేకూరుతుంది.
ఈ వ్యాపారంలో పశువుల ఆరోగ్యం అత్యంత కీలకం..
పశువులు లేదా కోళ్లను ఒకే చోట కట్టివేయకుండా, సహజ సిద్ధమైన గడ్డి, పురుగులు తినేలా ఖాళీ ప్రదేశంలో పెంచాలి. సకాలంలో వ్యాక్సిన్లు వేయించడం, వెటర్నరీ నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు. దూరంగా ఉండి పర్యవేక్షించేవారు ఆటోమేషన్ టూల్స్ లేదా కెమెరాల ద్వారా మానిటర్ చేయవచ్చు.
సీజనల్ డిమాండ్
అక్టోబర్ నుంచి మే నెల వరకు దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. ఈ సమయంలో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముందే ప్లాన్ చేసుకుని ఈ సమయానికి స్టాక్ సిద్ధం చేస్తే భారీ లాభాలు గ్యారెంటీ.
మార్కెటింగ్, విక్రయాలు..
గేటెడ్ కమ్యూనిటీలు: విల్లాలు, అపార్ట్‌మెంట్లలో నేరుగా సప్లై చేయవచ్చు.
స్పెషలైజ్డ్ స్టోర్స్: కేవలం నాటుకోళ్ల మాంసం మాత్రమే దొరికే రిటైల్ అవుట్‌లెట్స్ ప్రారంభించవచ్చు.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్: వాట్సాప్ గ్రూపులు లేదా చిన్న యాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని నేరుగా కస్టమర్లకు డెలివరీ చేయవచ్చు.