Reading Time: < 1 minute

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్ ముంబైకి 300వ టి-20 మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌ను విజయంతో ఆరంభించాలని ముంబై భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా కూడా ముంబైని చిత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

తుది జట్లు:

కెకెఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్బానీ.

ఎంఐ: రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్(కీపర్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధిర్, షార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్ఖండే, ఎఎం గజాన్ఫర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా.