
సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం ‘మిరాకిల్’లో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.. సీనియర్ హీరోలు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరో. ‘సత్య గ్యాంగ్, ‘ఫైటర్ శివ’ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన ‘కొండమడుగు’లో పూర్తిచేసుకున్న సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్ సభ్యులందరి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించింది ‘మిరాకిల్‘ చిత్రబృందం. తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్‌గా ‘మిరాకిల్‘ నిలిచిపోతుందని ప్రకటించడం ద్వారా ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది హీరోయిన్ హెబ్బా పటేల్. ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు మన ఇండియన్ స్క్రీన్‌పై రాని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతోంది ఈ చిత్రం’ అని తెలిపారు.