Reading Time: 2 minutes

Home Cleaning Tips :మీ బట్టలకు పురుగులు పడుతున్నాయా..వాడ్రోబ్స్లో ఇలా సర్దుకోండి..ఫ్రెష్ గా ఉంటాయి..!

Caption of Image.

వాడ్రోబ్​ లో పెట్టే బట్టలు, వస్తువులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం. కానీ, అవిపెట్టే షెల్ఫ్​ లు  పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయం. బట్టలు ఎంత క్లీన్ గా  ఉన్నా షెల్ఫ్ క్లీన్​ గా  లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. వాడ్రోబ్​ ను  క్లీన్​ గా , ఫ్రెష్​ గా  ఉంటే బట్టలు కూడా ఒక పద్ధతి ప్రకారం సర్దుకోవచ్చు. మరి వాడ్రోబ్​ ను  క్లీన్ గా, ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే ఏం చేయాలోఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

మరకలు లేకుండా : వాడ్రోబ్​ లో  మరకలు లేకుండా ఉంచుకుంటే ఫ్రెష్​ గా  ఉంటుంది. బట్టలు కూడా మురికి కాకుండా ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు డిటర్జెంట్, క్లెన్సర్లతో శుభ్రం చేసుకోవాలి.

పురుగులు పట్టకుండా : ఊలుతో చేసిన బట్టలకు ఎక్కువగా చిమ్మట పురుగులు పడతాయి. ఇవి బట్టలను తినేస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఒక బట్ట సంచిలో రోజ్ మేరీ, లవంగాలు వేసి వాడ్రోబ్​ లో ఒక మూల వేలాడదీస్తే చిమ్మట పురుగులు పట్టకుండా ఉంటాయి. వాటిలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ చిమ్మట పురుగులు రావు.

వుడెన్ హ్యాంగర్స్ బెస్ట్ : కొన్ని రకాల బట్టలను మడతపెట్టి షెల్ఫ్ లో పెట్టలేం. అలాంటి వాటిని ఫ్రీగా హ్యాంగర్స్ కు తగిలిస్తే మంచిది. వాటిని వాడ్రోబ్​ లో తగిలించుకునేందుకు వుడెన్ హ్యాంగర్స్ వాడితే బెస్ట్ డ్రెస్ ల షోల్డర్స్ షేప్ చక్కగా మెయింటెయిన్ చేసేందుకు ఆ హ్యాంగర్స్ బాగా ఉపయోగపడతాయి.

►ALSO READ | ఆధ్యాత్మికం.. ఆరోగ్యం : శివ తాండవ స్తోత్రం చదవితే .. మెదడు పనితీరు మెరుగుపడుతుంది

ప్లేసు సేవ్ చేయడం : వాడ్రోబ్ ప్లేస్ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ బట్టలు పెడితే చిందర వందరగా కనిపిస్తుంది. అందుకే, తక్కువ స్పేస్  లోనే ఎక్కువ బట్టలు పెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద పెద్ద స్వెట్టర్స్ లాంటివి పై షెల్ఫ్ లోపెట్టుకోవాలి. జిప్ ఉన్న బట్టలను ఒక క్రమ పద్ధతిలో జిప్ లోకి మడతపెడుతూ సర్దుకుంటే ప్లేస్ కలిసొస్తుంది. షెల్ప్ ఫ్రీగా ఉంటుంది.

ఆయిల్స్ తో ఫ్రెష్ గా : లావెండర్, గిరానియమ్, బేసిల్ ఎసెన్షియల్ ఆయిల్స్ ను షెల్ఫ్​ లో  పెట్టుకుంటే వాడ్రోబ్ ఎప్పుడూ ఫ్రెష్​ గా, మంచి సువాసన వస్తుంది.
 

©️ VIL Media Pvt Ltd.