Reading Time: < 1 minute

రిజర్వాయర్లకోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.