Reading Time: 2 minutes

గల్ప్ దేశాలకు ఇరాన్ మరోసారి వార్నింగ్.. మీ భూభాగం నుంచి దాడులకు అనుమతిస్తే.. తీవ్రంగా నష్టపోతారు

Caption of Image.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో ఇరాన్​ మరోసారి గల్ఫ్​ దేశాలకు వార్నింగ్​ఇచ్చింది.. మీ భూభాగాలనుంచి మాపైదాడికి  అనుమతిస్తే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. అమెరికా సైనికబలగాలు గల్ఫ్​ దేశాల్లో మోహరించాయి. మా పై దాడులు చేస్తున్నాయి. ఇది రిపీట్​అయితే మీ భద్రత, అభివృద్ధికి తీవ్ర ముప్పు తప్పదని గల్ఫ్​ దేశాలను హెచ్చరిస్తూ ఇరాన్​ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సోషల్ మీడియా ద్వారా శనివారం గల్ఫ్ దేశాలను హెచ్చరించారు.

గల్ఫ్​ దేశాలనుద్దేశించి ఇరాన్​ అధ్యక్షుడు  సోషల్​ మీడియాలో పోస్టు చేశారు. ‘‘ఇరాన్ ఎప్పుడూ ముందస్తు దాడులు చేయదు.. ఇది ఇంతకుముందుకూడా చెప్పాం.. అయితే మా మౌళిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా  దాడి చేస్తే గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని‘‘ మసూద్​ పెజెష్కియాన్​ Xలో పోస్ట్ చేశారు.  మీకు అభివృద్ది, భద్రత కావాలంటే మీరు మా శత్రువులకు  మీ భూభాగాలనుంచి అనుమతి ఇవ్వొద్దంటూ  హెచ్చరించారు. 

సౌదీలోని అమెరికా రహస్య స్థావరాలపై ఇరాన్​ దాడి 

ఇదిలా ఉంటే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో దుబాయ్​ లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్​ ప్రకటించిందని ఆదేశ మీడియా తెలిపింది. గతంలో ఇరాన్​ జరిపిన దాడుల తర్వాత అమెరికా సైన్యం ఈ ప్రాంతాలకు తరలివెళ్లిందని తెలిపింది. ఆ ప్రదేశంలో దాదాపు 500 మందికి పైగాఅ మెరికా సైన్యం ఉందని 400 మంది ఒకచోట, 100 మంది సైనికులు మరోచోట ఉన్నట్లు గుర్తించామని, ఖచ్చితమైన క్షిపణి, డ్రోన్​ దాడులు జరిపామని ఇరాన్​ తెలిపింది. అమెరికన్ సైనికులకుఆ ప్రాంతం స్మశానంగా మారిందని, చివరికి అమెరికా నాయకత్వం వెనక్కి తగ్గడం తప్పా మరో మార్గం ఉండదని ఇరాన్​ అధికార వర్గాలు తెలిపాయి.

►ALSO READ | మోదీ- ట్రంప్ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్..! పుకార్లను కొట్టిపారేసిన కేంద్రం

మిడిల్​ ఈస్ట్​ లో అమెరికా సైన్యం.. 

మరోవైపు పెంటగాన్ 82వ ఎయిర్​ బోర్న్​ డివిజన్​ కు చెందిన దళాలు పశ్చిమాసియాకు పంపనుందని సీబీసీ నివేదిక తెలిపింది.  ఈ సైన్యంలో అమెరికా కమాండ్​విభాగం, భూతల దళాలు ఉండొచ్చని తెలిపింది. ఇరాన్ ఆ ద్వీపానికి మందుపాతరలు అమర్చడం, అదనపు బలగాలను తరలించడం ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఖార్గ్ ద్వీపంలో అమెరికా భూతల సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.