Reading Time: < 1 minute

బీఆర్ఎస్‎ దళిత వ్యతిరేకి.. కౌశిక్ రెడ్డిపై మంత్రి వివేక్ ఫైర్

Caption of Image.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించాడని కాంగ్రెస్ సభ్యులు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యేను తుపాకీతో కాల్చి చంపేస్తానని కౌశిక్ రెడ్డి బెదిరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు.

దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి తీరు సరికాదని అన్నారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీది దళిత వ్యతిరేక వైఖరేనన్నారు. గతంలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడన్నారు. పోనీ దళిత నేతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమంటే ఆ పోస్టును ఆయన కొడుకు కేటీఆర్‎కు ఇచ్చాడని విమర్శించారు.

 బీఆర్ఎస్ పూర్తిగా దళిత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు.  బీఆర్ఎస్ అవినీతిపై హౌస్ కమిటీ వేయాలని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత కోరారని గుర్తు చేశారు. సొంత బావ హరీష్ రావుపై కవిత ఆవినీతి ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు భూ కబ్జా వ్యవహారంలో హరీష్ రావును ఇరికించానని కేటీఆర్ నవ్వుతున్నారని అన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.