Reading Time: 2 minutes
బాబోయ్ బయట అంత కల్తీనే! ఇంట్లోనే కమ్మని స్వచ్ఛమైన పెరుగును ఇలా తయారు చేసుకోండి

మన ముందు ఎన్ని కూరగాయలు ఉన్నా.. చివరికి పెరుగుతో తినకపోతే.. ఆ భోజనం అసంతృప్తిగానే ఉంటుంది. ఎందుకంటే పెరుగు ఉండే టేస్ట్ అలాంటి. రుచి మాత్రమే కాదు పెరుగుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యం వేసవిలో పెరుగు తినేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సమ్మర్‌లో మండే ఎండల నుంచి ఈ పెరుగు మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరాన్ని కూల్‌ చేస్తుంది. బయట షాప్‌లో దొరికే పెరుగుకు బదులు ఇంట్లోనే మనం పెరుగును తయారు చేసుకొని తింటే ఆ రుచి వేరే ఉంటుంది. కాబట్టి కల్తీకి చెక్‌ పెడుతూ ఇంట్లోనే స్వచ్చమైన గడ్డ పెరుగును 15 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలో స్టెప్‌ బై స్టెప్ తెలుసుకుందాం.

గడ్డ పెరుగును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి

పాలను మరిగించడం: పెరుగు తయారు చేసుకోవడానికి మనకు పాలు అవసరం. ఇందుకోసం సుమారు అర లీటరు పాలు తీసుకుని, దానిని 3-4 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించండి. దీని వల్ల పాలలోని నీరు తొలగిపోయి చిక్కటి పాలు రెడీ అవుతాయి. వాటిని స్టవ్‌ మీద నుంచి కిందకు దించి చల్లారే వరకు అలాగే ఉంచండి.

తోడు వేయడం: అయితే మీరు ఇప్పటికే మరిగించి చల్లార్చిన పాలను ఒక శుభ్రమైన బౌల్‌లో పోసుకొని అందులో కాస్త పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు మంచి గడ్డకట్టాలంటే మీరు దాన్ని బాగా కలపడం ముఖ్యం. అయితే పెరుగు మీకు మంచిగా రావాలంటే మట్టి కుండలో తోడు వేయడం ఇంకా ఉత్తమం.

కలపడం: తోడు వేసిన తర్వాత పాలను స్పూన్‌తో బాగా కలపాలి. లేదా ఒక గిన్నె నుండి మరో గిన్నెలోకి రెండు సార్లు పాలను వడపోయండి. ఇలా చేయడం ద్వారా తోడు పాలన్నింటికీ సమానంగా పడుతుంది. తర్వాత గిన్నెపై మూత పెట్టి, కదపకుండా ఒక పక్కన ఉంచాలి. మీకు పెరుగు పుల్లగా ఉండకూడదంటే తాజా పెరుగుతో తోడు వేయండి.

ఇది ఎండాకాలం కాబట్టి కేవలం 4 నుండి 6 గంటల్లో పెరుగు రెడీ అవుతుంది. అదే చలి కాలంలో అయితే పెరుగు గట్టకట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఓక వేళ మీ దగ్గర తోడు పెరుగు లేకపోతే, రెండు ఎండుమిర్చిలను గోరువెచ్చని పాలలో వేసి మూత పెడితే కూడా పెరుగు తయారవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.