
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి అర్హులైన దరఖాస్తుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద 243 సైంటిస్ట్-బి ఉద్యోగాలను కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ డేటా సైన్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండానే గేట్ స్కోర్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 24, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
- కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఐటీ విభాగంలో పోస్టుల సంఖ్య: 168
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో పోస్టుల సంఖ్య: 25
- డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో పోస్టుల సంఖ్య: 50
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, లేదా ఎంటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే 2024/ 2025/ 2026 గేట్‌లో వాలిడ్ స్కోర్ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మార్చి 31, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 24, 2026వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. గేట్ స్కోర్‌కు 60 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతంగా చెల్లిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.