Reading Time: 2 minutes
Virat Kohli 4000 Runs Chasing Ipl Record Rcb Vs Srh 2026

Virat Kohli: భారత దిగ్గజం విరాట్ కోహ్లీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మరో ఘనత సాధించాడు. ఛేజింగ్‌లలో 4000 పరుగులు దాటిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. శనివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఈ చారిత్రాత్మక ఘనతను సాధించాడు. ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్), ఐపీఎల్ చరిత్రలో రన్‌ ఛేజింగ్‌లో 4,000 పరుగుల మార్కును అందుకున్న తొలి బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా.. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ (13,571 పరుగులు) రికార్డును కూడా కోహ్లీ అధిగమించడం విశేషం.

READ MORE: CM Revanth Reddy: 12 ఏళ్లుగా జరుగుతున్న మైనింగ్ దోపిడీని తెలుస్తాం..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే కుప్పకూలినప్పటికీ బలంగా పుంజుకుని 201/9 పోటీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్ వర్మ త్వరగానే అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే.. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ జతకలవడంతో ఇన్నింగ్స్ ఊపందుకుంది. నాలుగో వికెట్‌కు ఇషాన్ కిషన్, క్లాసెన్ (31) జోడి కేవలం 53 బంతుల్లోనే 97 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు దిశగా సాగింది. వరుస సిక్సర్లతో హోరెత్తించిన క్లాసెన్ 14వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఎట్టకేలకు 202 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఫిలిప్ సాల్ట్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ (69 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (61) జంట విధ్వంసం సృష్టించింది. ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు కేవలం 45 బంతుల్లోనే 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్‌ను వన్‌ సైడ్ చేసేశారు. పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అంతేకాదు.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. చివర్లో కెప్టెన్ రజత్ పాటిదార్ (31) పైతం రాణించాడు.

READ MORE: TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!