Reading Time: 2 minutes

Summer season:  జుట్టు జాగ్రత్తలు..  నేచురల్ టిప్స్.. దగ దగా మెరిసిపోతుంది..! 

Caption of Image.

వేడి, ఎండ, చెమటల నుంచి జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఎండాకాలం అయిపోయే లోపు జుట్టు పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కెమికల్స్ లేని హెయిర్ ప్రొడక్ట్స్ వాడాలి. నేచురల్ పద్ధతులు ఫాలో కావాలి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!

ఎండకు బయటకు వెళ్తుంటే జుట్టుకి స్కార్ఫ్​ కట్టుకోవాలి. మగవాళ్లు నెత్తికి టోపీ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అల్ట్రావైలెట్ రేస్ నుంచి బయటపడొచ్చు. దీనివల్ల మాడు మీద తేమ పోదు. వేడి గాలులకు జుట్టు చిట్లి పోదు. రంగు వేసుకున్న జుట్టు పాడుకాదు.

ఎండాకాలం జడ అల్లుకోవాలి. అలాగని జుట్టును మరీ గట్టిగా బిగించి కట్టుకోవద్దు. అలా చేస్తే లాగినట్టు అయ్యి వెంట్రుకలు తెగిపోతాయి. ఎండ వేడికి జుట్టు పొడిబారితే ఈ నష్టం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అందుకని వచ్చిన స్టయిల్లో జడను కాస్త వదులుగా వేసుకోవచ్చు.నీళ్లు, కలబంద రసం, అవకాడో నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు పొడిబారినట్టు అనిపిస్తే వాడాలి. లేదా ఆర్గానిక్ నూనెను నీళ్లలో కలిపి వాడొచ్చు.

►ALSO READ | Good Health:  చెప్పులు లేకుండా వాకింగ్.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!

యాపిల్ సిడార్ వెనిగర్ ను నీళ్లలో వేసి వాడితే మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. కొంచెం కొబ్బరి నూనె లేదా షియా బట్టర్ (ఇది హెవీగా ఉంటుంది. కాబట్టి తక్కువ వాడాలి) వాడితే జుట్టు మృదువుగా ఉంటుంది. ఈ నూనె జుట్టుకు మెరుపు తెస్తుంది. వేవీ హెయిర్ అయితే నేచురల్ కర్ల్స్​ వస్తాయి. వారానికి ఒకసారి నేచురల్ పద్ధతిలో కండిషన్ చేయాలి. ఇలా చేస్తే జుట్టుకు తేమ అందుతుంది..

 స్విమ్మింగ్ చేసేముందు పావు కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ లో రెండు కప్పుల నీళ్లు కలిపి తడి జుట్టు మీద రాయాలి. ఇది రాయడం వల్ల స్విమ్మింగ్ చేసినప్పుడు జుట్టు రంగు పోవడం, డల్​గా అవ్వడం ఉండదు. అంతేకాదు ఈతకు ముందు జుట్టును తడిగా ఉంచుతుంది. ఇలా చేయడంవల్ల ఎక్కువ కోరిన్​ను జుట్టు పీల్చుకోదు.

యువీ ప్రొటెక్షన్ షాంపూలు ఉంటాయి. కానీ, వాటిలో రసాయనాలు ఉంటాయి. అందుకని అలాంటి షాంపూలు వాడకపోవడం బెటర్. వాటికి బదులు శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నాక చేతులనే జుట్టుకు రుద్దుకుంటే సరిపోతుంది.

” కొబ్బరి ఆలివ్​, అవకాడో నూనెలు జుట్టు కుదుళ్ల కి వెళ్లాయి. అందుకని షాంపూ చేశాక జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ నూనెల్లో ఏదో ఒకదాన్ని రాసుకోవాలి. తరువాత కండిషన్ చేస్తే జుట్టుకు తేమ
అందుతుంది. జిడ్డుగా అనిపించదు కూడా. 

“బీచ్ లుక్ కోసం సీసాల్ట్ స్ప్రే వాడొచ్చు. ఒక టీస్పూన్ సాల్ట్, ఒక టీస్పూన్ కొబ్బరి నూనె, నీళ్లు కలిపి స్ప్రే బాటిల్ లో పోసి వాడాలి. ఇందులో ఉండే కొబ్బరి నూనె సాల్ట్ వల్ల కలిగే డ్రైనెస్ ను తగ్గిస్తుంది.

వేసవికాలం తక్కువసార్లు తలస్నానం చేయాలి. తలస్నానం రెగ్యులర్​ గా చేస్తే మాడు మీద నూనెలు విడుదలవుతాయి. జిడ్డుగా అనిపించి ఎక్కువసార్లు తలస్నానం చేయాలనిపిస్తుంది. అలాగే తలస్నానానికి నేచురల్ డ్రై షాంపూలు… అంటే కార్న్ స్టార్ట్ వంటివే వాడాలి.

జుట్టు తడిగా ఉన్నప్పుడు తలలో దువ్వెన పెట్టి లాగొడ్డు. ఇలాకానీ చేశారంటే జుట్టు బాగా చిట్లిపోతుంది. వెడల్పాటి పళ్లున్న దువ్వెనలు వాడాలి. వీటివల్ల జుట్టు చిక్కు పడదు. అదే హెయిర్ బ్రష్​ లు వాడితే జుట్టు లాగినట్టు అయ్యి చిట్లిపోతుంది.

సమ్మర్​ సీజన్లో జుట్టుకు బ్లో డ్రై చేయకపోవడమే బెటర్ తలస్నానం చేసిన జుట్టు వేడికి త్వరగానే ఆరిపోతుంది. దాన్ని బ్లో  డ్రై చేస్తే జుట్టు పాడవుతుంది. అలాగే ప్లాటే ఐరన్ వంటివి చేసుకోవద్దు. దానివల్ల జుట్టు మరింత పాడవుతుంది.

వెలుగు,లైఫ్​

©️ VIL Media Pvt Ltd.