
యంగ్ హీరో అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న పాన్- ఇండియా యాక్షన్ -రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. శనివారం మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘చిచ్చుబుడ్డి’ని విడుదల చేశారు. ఇది శేష్ క్యారెక్టర్ సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. ’చిచ్చుబుడ్డి’ పాట సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇందులో అడివి శేష్ తొలిసారిగా తెరపై డ్యాన్స్ చేస్తూ హై-ఎనర్జీ అవతార్‌లో అదరగొట్టారు. సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఫోక్ బీట్‌లతో కూడిన పార్టీ జానర్ పాట కంపోజ్ చేశారు. భాస్కరభ ట్ల రవికుమార్ విజువల్స్‌కి సరిపోయే సర దా, ఆటపట్టించే సాహిత్యం అందించారు. జోనితా గాంధీ తన ఎనర్జిటిక్ గాత్రంతో ఈ పాటకు పవర్ జత చేశారు. తన గ్లామరస్ డ్యాన్స్ తో తెరపై కూడా మెరిశారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ’డెకాయిట్’ చిత్రంలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.