Reading Time: < 1 minute

పిట్లంలో కుస్తీ పోటీలు

Caption of Image.

పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా పిట్లంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలను స్థానిక సర్పంచ్ ​కుమ్మరి శేఖర్ ప్రారంభించారు. 

పిట్లం పరిసరాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి వచ్చిన మల్లయోధులు కుస్తీలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. శనివారం రాత్రి నిర్వహించిన రథోత్సవం అలరించింది. కళాకారుల నృత్యాలు అలరించాయి.

©️ VIL Media Pvt Ltd.