Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి శాసన సభలో అనుచితంగా ప్రవర్తించారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్‌తో కాల్చి పడేస్తానని సైగలు చేయడంతో ఏ పార్టీలో ఉన్నావని ప్రశ్నించారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మంత్రులు మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డి వీడియోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అధి శ్రీనివాస్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కౌశిర్ రెడ్డి ఎంఎల్‌ఎగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ హెడ్ ఫోన్ విసిరి దాడి చేయడంతో స్పీకర్ వారి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. వారు హైకోర్టు మెట్లు ఎక్కడంతో సభ్యత్వ రద్దు చెల్లదని తీర్పు నిచ్చింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ఆసక్తిగా మారింది.