
దసరా.. మాస్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాలో మాస్ గెటప్‌తో అభిమానులకు షాకిచ్చిన నాని.. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత యాక్షన్ చేసి రిస్క్ చేశాడు. అయితే ఆయన చేసిన రిస్క్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. మార్చి 30, 2023న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో దసరా పండుగ వాతావరణం, స్నేహం, ప్రతీకారం, భావోద్వేగాలను అపూర్వంగా మేళవించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 121 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ సినిమా పంచిన అనుభూతి సినీ ప్రేమికులకు గుర్తుంది. ఎన్నో విజయాలను అందుకున్న నాని కెరీర్‌లో ఇది మైలు రాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమాతోనే దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. సాధారణ కథను ఎంతో గ్రిప్పింగ్‌గా, రియలిస్టిక్‌గా తీర్చిదిద్ది ఆయనలో టాలెంట్‌ను నిరూపించుకున్నారు. గ్రామీణ జీవితాలు, దళిత రాజకీయాలు, స్నేహితుల మధ్య బంధం నుంచి ప్రతీకారం వరకు అన్నీ అద్భుతంగా చెప్పారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డెప్త్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నింటికీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ దసరా సినిమాకు మరో ప్లస్ పాయింట్.
సూరి పాత్రలో నేచురల్ స్టార్ నాని పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కెరీర్ బెస్ట్ అనిపించేలా చేశారు నాని. ఒక చిన్న క్రిమినల్ నుంచి ప్రతీకారం తీర్చుకునే హీరోగా మారడంలో నాని నటన అద్భుతం. నానిని ఎందుకు ‘నేచురల్ స్టార్’ అంటారో మరోసారి నిరూపించింది ఈ సినిమా.
Dasara2
మెప్పించిన కీర్తి సురేష్..
ఇక హీరోయిన్ కీర్తి సురేష్ తన క్యారెక్టర్‌లో నటించింది అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పచ్చు. బలమైన, ఎమోషనల్, సెన్సిటివ్ పాత్రలో కీర్తి హార్ట్ టచింగ్ పెర్ఫామెన్స్ చేశారు. నానితో కీర్తికి ఇది మొదటి సినిమా కాకపోయినా.. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్.. దసరా సినిమాలో ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్‌తో అభిమానులను మెప్పించారు.
మూడు సంవత్సరాలు గడిచినా ‘దసరా’ విజయం తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తుండిపోతుంది. ఇటువంటి రియలిస్టిక్ స్టోరీలు, బలమైన నటన, స్మార్ట్ డైరెక్షన్ ఇండస్ట్రీకి అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దసరా సినిమా విడుదలై భారీ సక్సెస్ సాధించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాని, కీర్తి సురేష్, శ్రీకాంత్ ఒడెల టీమ్‌కు అభినందనలు.