Reading Time: < 1 minute
Telangana: రామాలయంలో అద్భుతం.. అంజనేయుడికి హారతి, మొక్కులు చెల్లించిన వానరం!

హనుమంతుడికి ప్రతిరూపమే వానరం అంటారు. అలాంటి వానరం ఆయన సన్నిధానానికి చేరుకుని పూజలు చేసిన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. దహెగాం రామాలయంలోని హనుమాన్ విగ్రహనికి హనుమాన్ స్వాములు పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో కాని ఒక వానరం స్వామి వారికి మంగళ హారతి ఇచ్చేంత వరకు శ్రద్ధగా నిలబడిపోయింది. పూజలు పూర్తి అయ్యేవరకు వేచి చూసి హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లి మొక్కింది. అనంతరం స్వామివారికి సమర్పించి తీర్థ, ప్రసాదాలు తీసుకుని వెళ్లిపోయింద స్వాములు తెలిపారు. ఆ భగవాన్ హనుమంతుడే వానర రూపంలో వచ్చి మాకు దర్శనం ఇచ్చాడని స్వాములు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..