Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచి అనంతరం ఆమెను ముక్కలు ముక్కలు నరికి ప్రీజులో శరీర భాగాలను దాచిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విజయనగరం జిల్లా రాజాముకు చెందిన చింతాడ రవీంద్ర(35) నేవీలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వైజాగ్‌లోని ఎల్ వి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రవీంద్ర భార్య తన పుట్టింటికి పోవడంతో తన స్నేహితులు మౌనికను(29) ఇంటికి రమ్మని కబురు పంపాడు. మౌనికను చంపేసి అనంతరం ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు సదరు అపార్ట్‌మెంట్ చేరుకొని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తల భాగం కనిపించలేదని సమాచారం. డబ్బుల కోసం యువతి వేధించడంతో తాను హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.