
హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో భోజనం విషయంలో తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటనలో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. కోకాపేట్ నార్త్ స్టార్ విల్లాస్లో ఘటన జరిగింది. కార్తీక్ అనే డ్రైవర్ను షేక్ పాషా అతి దారుణంగా చంపేశాడు. రాత్రి డిన్నర్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. రాత్రి 8.30 గంటలకు భోజనం పెట్టాలని కుక్గా పని చేస్తున్న షేక్ పాషా దగ్గరకు డ్రైవర్ కార్తీక్ వెళ్లాడు. భోజనం రెడీగా లేదని, రాత్రి 9.30 రావాలని షేక్ పాషా చెప్పాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకూ పరిస్థితి వెళ్లింది. క్షణికావేశంలో కిచెన్ నుంచి కత్తి తెచ్చిన షేక్ పాషా ఒక్కసారిగా ఆవేశంతో కార్తీక్ కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై కార్తీక్ కొంత సేపటికి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | మణికొండలో అగ్నిప్రమాదం… అపార్టుమెంట్లో మంటలు..