Reading Time: < 1 minute

హైదరాబాద్: కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఇవి పాలసీ తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవి వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్ నుండి అసెంబ్లీకి ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి ఎలక్ట్రిక్ కారులో ప్రయణం చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి వాహనాలకు 10 నుంచి 20 శాతం ప్రోత్సాహానికి ముందుకు వచ్చిన టాటా మోటార్స్ ను మంత్రి పొన్నం అభినందించారు. మినిస్టర్ క్వార్టర్స్ నుండి అసెంబ్లీ కి ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి వాహనాల కంపెనీలు 10-20 శాతం రాయితులు కల్పిస్తున్నాయని వివరించారు. ఇవి పాలసీలో భాగంగా ప్రభుత్వం వంద శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ మినహాయింపు ఇచ్చిందని, ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లు మినహాయింపు ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇవి వాహనాల ప్రోత్సాహంలో భాగంగా చార్జింగ్ స్టేషన్ లు, మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు రాయితీ ప్రకటించడం జరిగిందన్నారు. 

https://www.facebook.com/share/r/1AkyA7KRcL/