
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఉన్న క్రేజ్ వేరు. ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న ఈ జట్టు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన రికార్డును ముంబై తమ ఖాతాలో వేసుకోనుంది. ఈరోజు జరిగే మ్యాచ్ ముంబైకి 300 టి-20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా అత్యధిక (300 మ్యాచులు) టి-20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఐపిఎల్ ఫ్రాంచైజీగా ముంబై రికార్డు సృష్టించనుంది.
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్‌లలో 162 విజయాలు సాధించింది. ఓవరాల్‌గా అత్యధిక టి-20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ఈ లీస్ట్‌లో మొదటి ప్లేస్‌లో పాకిస్థాన్(303) ఉండగా, రెండో స్థానంలో సోమర్‌సెట్(303) ఉంది.