
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తోంది. అన్ని రంగాలలో దీని ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్నది. ఉద్యోగ నియామకాల్లోనూ ఏఐ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంలో సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. దాంతో, విద్యార్థులు, ఉద్యోగార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మంచి అవగాహన పెంచుకోవడం ద్వారా వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. ఇప్పుడు ఎన్నో వేదికల ద్వారా ఈ నూతన టెక్నాలజీని ఎక్కడి నుంచైనా నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ఏఐ, మెషీన్ లెర్నింగ్ & జనరేటివ్ ఏఐ
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఏఐ, మెషీన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం భవిష్యత్తు ఉద్యోగాల కోసం చాలా అవసరమవుతుంది. ప్రస్తుతం, ఉద్యోగాలు, పరిశోధనలు, స్టార్టప్స్ అన్నీ ఏఐ ఆధారంగా ముందుకు సాగుతున్నాయి. అందుకే, ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి నేర్చుకోవడం అనివార్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు, యూనివర్సిటీలూ ఈ కోర్సులను ఉచితంగా అందిస్తున్నారు.
జనరేటివ్ ఏఐ:
జనరేటివ్ ఏఐ టెక్నాలజీ విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతోంది. ఇది టెక్స్ట్ రాయడం, చాట్‌బాట్స్ రూపొందించడం, కోడ్ జనరేట్ చేయడం, మ్యూజిక్, చిత్రాలు వంటి కొత్త కంటెంట్‌ను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు భవిష్యత్తులో అవకాశాలను త్వరగా అందిపుచ్చుకోవాలంటే ఈ జనరేటివ్ ఏఐ గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. గూగుల్ క్లౌడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా ఈ కోర్సును నేర్చుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక ధృవపత్రం కూడా పొందవచ్చు.
రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్:
మెషీన్ లెర్నింగ్ గురించి అవగాహన పెంచుకోవడం కూడా కీలకమైంది. ఇందులో ఆల్గారిథమ్స్, ఏఐ ఫార్ములాలు, సిస్టమ్స్ థింకింగ్ వంటి అంశాలను బోధిస్తారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఈ కోర్సుకు సంబంధించిన ఉచిత ట్రైనింగ్ అందిస్తోంది. ఏఐ పరిశోధనలో స్థిరపడి ఉండాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారుతుంది.
ఏఐ ఫర్ బిగినర్స్:
ఏఐ ఫర్ బిగినర్స్ కోర్సు ప్రత్యేకంగా ఏఐ ప్రారంభం నుంచి నేర్చుకోవడానికి రూపొందించబడింది. ఇందులో ఏఐ అంటే ఏమిటి, మిషన్ లెర్నింగ్ మౌలిక అంశాలు, జనరేటివ్ ఏఐ ప్రయోజనాలు, ప్రాక్టికల్ కోర్సులపై అవగాహన పెరుగుతుంది. ఐబీఎమ్ ఈ కోర్సును తయారుచేసింది. కోర్సెరా, మైక్రోసాఫ్ట్ వంటి వేదికల ద్వారా ఉచితంగా అందిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారు ప్రాక్టికల్ ఎక్జాంపుల్స్‌తో నేర్చుకోవచ్చు.
యువ ఏఐ ఫర్ ఆల్:
భారత ప్రభుత్వం ప్రారంభించిన యువ ఏఐ ఫర్ ఆల్ కోర్సును ఉచితంగా నేర్చుకోవచ్చు. ఇది పూర్తి చేసినవారు భారత ప్రభుత్వం నుంచి ధృవపత్రం పొందవచ్చు. ఈ కోర్సులు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో, స్వయం పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచ స్థాయి సంస్థలు, కోర్సులు:
హార్వర్డ్, ఎమ్‌ఐటీ, ఐఐటీ మద్రాస్, కాలిఫోర్నియా యూనివర్సిటీలు వంటి ప్రముఖ సంస్థలు ఉచితంగా ఏఐ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు ప్రారంభ స్థాయిలో నేర్చుకోవడానికి అనువైనవి. అలాగే పైతాన్, మెషీన్ లెర్నింగ్ వంటి అంశాలు కూడా అందిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థలలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఈ కోర్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
సమగ్ర అభ్యాసం:
విద్యార్థులు ముందుగా ప్రాథమిక కోర్సులు పూర్తి చేసుకోవాలని జాగ్రత్త పడాలి. పైతాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం, చిన్న ప్రాజెక్టులు చేయడం ద్వారా అనుభవాన్ని పెంచుకోవడం ముఖ్యం. టెక్నాలజీకి సంబంధించి పుస్తకాలు చదవడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీరు నేర్చుకున్న స్కిల్స్ రేపటి కెరీర్‌ను బలపరచడానికి అవసరమైన పునాదిగా నిలుస్తాయి. సరైన మార్గదర్శకం, క్రమశిక్షణ, ఆసక్తి కలిగితే, విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే.. ఏఐ, మెషీన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే, భవిష్యత్తులో ఉన్న అనేక కొత్త ఉద్యోగ అవకాశాలు, పరిశోధనలపై దృష్టి పెట్టవచ్చు.