Reading Time: < 1 minute

ఉప్పల్: డిగ్రీ విద్యార్థినిని లెక్చరర్ లైంగికంగా వేధించిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. కాప్రాకు చెందిన ఓ విద్యార్థిని లిటిల్ ప్లవర్ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. సదరు విద్యార్థినికి అనారోగ్య సమస్యలు ఉండడంతో కాలేజీ హాజరు కాలేనని డాక్టరు సర్టిఫికెట్ సమర్పించడంతో పాటు అటెండెన్స్ ఫీజు చెల్లిస్తూ పరీక్షలు రాస్తోంది. ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు తనను వేధింపులకు గురి చేశాడని, సెకండియర్ చదువేటప్పుడు తన వ్యక్తిత్వ హననం చేయడంతో పాటు ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధించాడని తెలిపాడు. వేధింపులపై గతంలో ఫిర్యాదు చేశానని, మళ్లీ ఇప్పుడు వేధిస్తున్నాడని విద్యార్థిని వాపోయింది. దీంతో ఆమె తల్లికి చెప్పడంతో ఇద్దరు కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.