
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఆయన సోదరి నిహారిక కొణిదెల నిర్మాతగా ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పతాకంపై సినిమా రూపొందుతోందుతున్న విషయం తెలిసిందే. వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కోసం వరుణ్ తేజ్ గత ఏడు నెలలుగా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా పూజకార్యక్రమాలు చేపట్టగా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టడం విశేషం. ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్ అంతా మళ్ళీ ఈ సినిమా కోసం పనిచేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని పనులను త్వరగా పూర్తి చేసి, 2027 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న 16వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు ‘బరి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే..
Also Read : Anudeep: ‘ఫంకీ’ దెబ్బతో..కామెడీని పక్కన పెట్టి రూటు మార్చిన అనుదీప్..
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలు లేదా వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాలు అనగానే అందరూ మలయాళ చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంటారు. మరీ ఈ మధ్యకాలంలో అయితే మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తున్నాయి. అయితే ‘బరి’ మూవీ లాంచ్ సందర్భంగా ఇదే విషయంపై ప్రశ్నించగా, దర్శకుడు యదు వంశీ చాలా కాన్ఫిడెంట్‌గా సమాధానమిచ్చారు.. ‘మలయాళ సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మా దగ్గర కంటెంట్ ఉంది, మేము తీసి చూపిస్తాం. మన కథలు, మన ఎథిక్స్, మన వాల్యూస్‌తో గొప్ప సినిమాలు తీయగల సామర్థ్యం మనకు ఉంది. నేను అది తీసి చూపిస్తాను’ అంటూ ఆయన సవాల్ విసిరారు. ఇతర భాషా చిత్రాల కంటే మన తెలుగు నేటివిటీతో కూడిన స్పోర్ట్స్ డ్రామాలు పవర్‌ఫుల్‌గా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.