
సండే వచ్చింది.. ఇవాళ నాన్‌వెజ్ తినే వాళ్లంతా ఇవాళ మార్కెట్‌కి వెళ్తారు. చికెనో, మటనో, ఫిష్షో, ప్రాన్సో ఏదో ఒకటి కొంటారు. జనానికి ఉన్న ఈ వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకునేందుకు కొందరు కుళ్లిన మటన్ కూడా అమ్మేస్తున్నారు. ఏకంగా ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల నుంచి తెచ్చి ఈ దందా కొనసాగిస్తున్నారు. అందుకే.. ఏం కొనాలన్నా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో కల్తీ దందా భారీగా పెరుగుతోంది. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని గోషామహల్‌లో పాడైన మటన్ అమ్ముతున్న ఓ షాప్‌పై గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ మటన్ షాప్‌లో యూపీ నుంచి తీసుకొచ్చి మేక, గొర్రె మాంసం నిల్వ చేశారు. అయితే.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఒకటి రెండు కిలోలు కాదు.. ఏకంగా వేలాది కిలోలు కుళ్లిన మాంసం బయటపడింది. వేలాది కిలోల మేక, గొర్రె మాంసంతోపాటు.. తలలు, కాళ్లు, స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు .. FSSAI అనుమతులు లేకుండా మాంసం విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. ఫేక్ మసాలాలు.. కుళ్లిన మాంసం బయటపడటంతో.. ఇలాంటివి కొనేటప్పుడు జాగ్రత్త అంటూ సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎల్లప్పుడూ ఫ్రేష్ గా ఉన్న వాటినే కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు. మొత్తం.. పాయా కోసం సుమారు 5400 కాళ్లు.. మేక, గొర్రె తలలు 20, బ్రెయిన్ 25, మటన్ రిబ్స్15 కిలోలు డబుల్ డీప్ ఫ్రీజర్లు 5ను గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.
వీడియో చూడండి..
వెటర్నరీ డాక్టర్ లైసెన్స్ లేకుండా మాంసం నిల్వ, విక్రయం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. GHMC నుంచి NOC లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ లేకుండా ప్యాకింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..