
మేష రాశి ఫలితాలు
మేష రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా చాలా బాగుంది. ఖర్చు అధికంగా ఉంటుంది వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి. వ్యాపార రీత్యా కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. లాభాలు బాగుంటాయి రొటేషన్స్ కూడా బాగుంటాయి. కుటుంబానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటాయి సంతానం మీద ఒక శ్రద్ధ చూపిస్తారు వారి విద్య పట్ల వారి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. సంతానం పట్ల ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఈ రాశి వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ధనాధాయం బాగుంటుంది. వ్యాపార రీత్యా కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతారు. నలుగురిలో గుర్తింపు కోసం కష్టపడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానాచలం కానీ పై అధికారులతో విభేదాలు కానీ ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. వచ్చిన అవకాశం చేజారి పోకుండా జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి కాస్త గడ్డు కాలమని చెప్పవచ్చు. ఉద్యోగం మారడం కానీ లేదా రిజైన్ చేయడం కానీ కనిపిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. అయితే మీ మనో ధైర్యంతో ముందుకు వెళ్ళండి. కొన్ని మంచి అవకాశాలు చేతిదాక వస్తాయి వాటిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళండి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. గడిచిన వారం కంటే ఈ వారం కొంతమేర బాగానే ఉంటుంది. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం అదేవిధంగా దుర్గాదేవి అష్టోత్తరం కానీ స్తోత్రం గాని పటించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి ఫలితాలు
వృషభ రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారం సొంతంగా చేయాలనుకునే వారు కాస్త నిదానంగా ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే సొంత వ్యాపారం చేసుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకుంటే ఇద్దరి జాతకాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వృత్తిరీత్యా ఏదైనా స్థిరమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలో స్థాన మార్పు కానీ లేదా ఉద్యోగ వ్యవహారంలో అధికారులతో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు కాస్త అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఏది ఏమైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి కొన్ని శుభకార్యాలు ఆధారపడి ఉన్నాయి. మీరు చేసే పనిలో ప్రతిఫలాన్ని ఆ దైవానికి వదిలేయండి. కష్టేఫలి అన్న విధంగా కష్టపడండి. ఈ రాశి వారికి భూ సంబంధిత విషయ వ్యవహారాలు గృహ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. రిటైల్ రంగంలో ఉన్న వారికి కాంట్రాక్టు రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదేవిధంగా విద్యా వ్యవస్థలో పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు కాస్త గడ్డు కాలమని చెప్పవచ్చు. చదువు మీద శ్రద్ద వహించాలి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి సోషల్ మీడియాను దూరం పెట్టాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లినట్లయితే మరింత బాగుంటుంది. ఏదైనా సరే పెద్దవాళ్ల సలహాలు తీసుకొని మరింత సక్సెస్ అయ్యే పనులు చేయండి అంతేకాని సొంత నిర్ణయాలు తీసుకోవద్దు కొంత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో అష్ట మూలిక తైలంతో దీపారాధన చేయటం మంచిది. రాహు కాల సమయంలో నిమ్మకాయ డొప్పలలో నువ్వుల నూనె పోసి మంగళవారం శుక్రవారం దీపారాధన చేయండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా గాని ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారులతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రాశిలో జన్మించిన వారికి కలుసుకోచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి ఫలితాలు
మిధున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన విషయ వ్యవహారాలు త్వరలోనే సానుకూల పడతాయి. కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్స్ కి టెక్నికల్ రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగంలో ఉన్న వారికి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉన్నప్పటికీ మనసు స్థిమితంగా లేకుండా ఉంటుంది. కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారాలకు ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. లాభాలు వచ్చే విధంగా గ్రహచారం గోచరుస్తుంది. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లినట్లయితే మరింత బాగుంటుంది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పటించడం చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించ గలుగుతారు. కష్టేఫలి అన్నట్లుగా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన విషయ వ్యవహారాలు స్త్రీలకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా కార్యక్రమం తలపెట్టేముందు వినాయకుడి కి పూజ చేసి ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. దుర్గా స్తోత్రం పాటించండి. వ్యాపారంలో చేతి దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇలాంటి పరిస్థితులలో నిరుత్సాహ పడొద్దు. ప్రస్తుతం నడుస్తున్న దశ బాగాలేదు అంతే కావున సహనంగా ఉండే ఓర్పుతో ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పాటించడం అలాగే రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కాని శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటక రాశి ఫలితాలు
కర్కట రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది . ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటే ఆరోగ్య రీత్య సహకరించదు. సెల్ఫ్ డ్రైవ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం అన్ని బాగుండి శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగరీత్యా అన్ని చాలా బాగుంటాయి. వ్యాపారరీత్యా కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు బాగానే ఉంటాయి. ఏదైనా సరే ప్రయాణాల విషయాలలో జాగ్రత్త వహించండి మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతున్నాయి. ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు లేదా అనేటప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది. నూతన గృహం కొనాలనుకుంటారు అది నెరవేరుతుంది. ఈ రాశి వారు ఈ వారం గణపతి ఆరాధన చేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులకు కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. విద్య మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం చెడు స్నేహానికి దూరంగా ఉండటం కోపాన్ని తగ్గించుకోవటం అన్ని మనకే తెలుసు అని కాకుండా పదిమందితో షేర్ చేసుకుని తద్వారా దాంట్లో మంచిని ఎంచుకోవడం చెప్పదగిన సూచన. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కాలం అనుకూలంగా ఉంది. మీ తెలివితేటలను బట్టి మంచి అవకాశాల్లో వచ్చే అవకాశం లేకపోలేదు. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. మనసుకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్లాలి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి కలిసి వస్తాయి. అదేవిధంగా స్త్రీలు సొంత వ్యాపారాలు చేయాలి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే భావనతోటి ముందుకు వెళతారు. వాటి ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం. ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళండి అలాగే మీ వ్యాపారాన్ని జీవిత భాగస్వామి పేరుమీద ప్రారంభించండి చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశం గోత్ తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి గత వారం ఈ వారం సమతూలంగా ఉన్నాయి. బంద్ వర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం అదేవిధంగా సుబ్రమణ్య స్వామికి ఆరు మంగళవారాలు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నాగ సింధూరం ధరించండి నరదృష్టి ఉంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహరాశి ఫలితాలు
సింహరాశి వారికి ఈ వారం మధ్యత ఫలితాలు గోచరిస్తున్నాయి వీరికి అష్టమ శని నడుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తుంది. చేతిదాక వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం లేకపోలేదు. మీరు ఎంత మంచిగా చేద్దామనుకున్నా సరే కింది స్థాయి ఉద్యోగులను కానీ పైస్థాయి ఉద్యోగులను కానీ ఇబ్బంది పెట్టే విధంగా గ్రహచారం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి చార్టెడ్ అకౌంట్ వారికి బ్యూటీషియన్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణమని చెప్పవచ్చు సడన్గా ఉద్యోగం కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సందర్భాలలోనే మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతనానికి సంబంధించిన విషయాలు వ్యవహారాలు వారి విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు వారి వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. నూతన కార్యక్రమాలు ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. కింది స్థాయి ఉద్యోగస్తుల తోటి మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది వారితో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు ఏమనుకున్నా సరే మాట పట్టింపులకు పోయి ఇబ్బందులకు గురి కాకుండా మీరు అనుకున్న మార్గంలోనే ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే వివాహానికి సంబంధించిన విషయాలు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడం చెప్పదగినది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం అదే విధంగా శనివారం నాడు ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి ఫలితాలు
కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొనుగోలు విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉన్నారు అనే విషయాన్ని గ్రహించండి. ఏ పనిలో గాని మా ఎదుగుదలను చూసి ఎవరూ లేక మనల్ని పక్కకు పెట్టాలని లేదా వ్యాపారంలో మన స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తారు ఇలాంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని సంఘటనలో కూడా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభం సూచిస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు బ్యూటీషియన్స్ టెక్నికల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సిరిగల రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. ఎదుగుదలకి ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అవి సమసి పోతాయి. అదేవిధంగా రిలేటెడ్ రంగంలో ఉన్న వారికి కాస్త నిదానంగా ఉంటుంది. స్టీల్ ఐరన్ కాపర్ వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు కూరగాయ వ్యాపారస్తులకు కాస్త గడ్డు కాలమని చెప్పవచ్చు. ఏదైనా భూమిని కొనేటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని ఒకటికి రెండుసార్లు పరిశీలించండి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీరు బాగా సంపాదిస్తున్నారని ఎవరిని పట్టించుకోవడంలేదని కొందరు ఈర్ష్య ద్వేషాలను కలిగి ఉంటారు మీ పట్ల. ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే నలుగురిలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోని పదవులు లభిస్తాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి స్త్రీలకు వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రిత్యా మటుకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేతి దాకా వచ్చి చేజారిపోతాయి. పునర్వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా ఇదే విధంగా ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం గాన్ని సుందరకాండ పారాయణం కాని చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. రాశి వారి ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి
తులా రాశి ఫలితాలు
తులారాశి వారికి వివాహం చాలు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కలిసి వస్తుంది. ఆశించిన స్థాయిలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో చదువు విషయం లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. బంగారు ఆభరణాలు కానీ భూమి కానీ కొనుగోలు చేస్తారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంత వ్యాపారం చేసుకున్నప్పటికీ ఏదో ఒక రూపంగా ఖర్చు అధికంగానే ఉంటుంది. లాభాలు బాగుంటాయి కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. గొప్పలకు ఆడంబరాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించినట్లయితే కొంతవరకు ముందుకు వెళ్తారు. ఏది ఏమైనా సరే భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య రంగంలో ఉన్న వారికి విదేశాలలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి సినీ పరిశ్రమలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణమని చెప్పవచ్చు. సహోదరి సోదరుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే విధంగా గ్రహచారాలు గోచారిస్తున్నారు. మొండి వైఖరిని పక్కన పెట్టడం మంచిది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పటించడం అదేవిధంగా దుర్గా స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతో అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కాని శుక్రవారం కాని వెళ్ళండి కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి ఫలితాలు
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలలో స్థిరాస్తికు సంబంధించిన విషయ వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యాపరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు కాస్త నిదానంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేతి దాక వచ్చినట్టే వచ్చి చేజారి పోతాయి. వ్యాపార రీత్యా కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సహోదరి సోదరుల మధ్య బంధు వర్గాల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువగా పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీ చేతికి అందుతాయి. వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా చాలా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. విసా విషయంలో స్టాంపింగ్ విషయంలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది మంచి సంబంధం కుదురుతుంది. కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపంలో పెట్టుకోవడం మంచిది చేయడం కానీ కలిసి రాదు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో కూడా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. సొంతింటి కల నెరవేరుతుంది బంగారు ఆభరణాలు ఆభరణాలు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. చివరకు మంచి ఫలితాలే ఉంటాయి కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఏది ఉండదు. భూ సంబంధిత విషయ వ్యవహారాలలో స్థిరాస్తికు సంబంధించిన విషయ వ్యవహారాలలో అలాగే కోర్టు కేసులలో కొంత ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడే అవకాశం ఉంది. వాటి విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ చదువు మీద పోటీ పరీక్షల మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంది. సుబ్రహ్మణ్యస్వామి అష్టకం కానీ శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈరాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు. మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనుస్సు రాశి ఫలితాలు
ధనస్సు రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగరీత్యా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఉద్యోగంలో స్థాన మార్పు ఉన్నప్పటికీ పై అధికారులతో కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ దైవానుగ్రహం వలన అందులో కొంతమేరకు మంచి జరుగుతుంది మీ నీతి నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన సరే వాటన్నింటిని మీ మనోధైర్యంతో దాటుకుని ముందుకు వెళతారు. ప్రతి విషయానికి ఆందోళన పడకుండా ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది ప్రయాణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకోండి. సహోదరి సోదరుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లడం వలన మంచి జరుగుతుంది. రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం తప్పక చేతికి అందుతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు క్రయవిక్రయాలకు సంబంధించిన విష వ్యవహారాలు లాభ సాటిగా ఉంటాయి. అదేవిధంగా ఒక కొత్త ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుంటారు అది కాస్త నిదానంగా ముందుకు వెళుతుంది, నడుస్తుంది కాబట్టి ప్రతి పని కూడా నెమ్మదిగా సాగుతుంది. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకంచేయటం అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా వృత్తి ఉద్యోగ రీత్యా కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుంటారు. ఉద్యోగంలో స్థాన చలనం చూపిస్తుంది. ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. సెల్ఫ్ డ్రైవ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనాప్పటికీ ఈ వారం గడిచిన వారం కంటే బాగుంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశివాయ భక్తులతో దీపారాధన చేయటం దుర్గ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకర రాశి ఫలితాలు
మకర రాశి వారికి ఈ వారం అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొన్ని చేతిదాకా వచ్చి వెనక వెళ్లిపోవడం జరుగుతుంది అలాగే ప్రేమ వివాహా విషయ వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. అన్ని మనకు తెలుసు అనే భావన నుంచి బయటకు రావాలి ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వారు ఎవరు అనే విషయాన్ని గ్రహించాలి. లేకపోతే ఆరోగ్యరిత్యా, ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కాస్త ఆలస్యమైన మంచి ఉద్యోగం దొరుకుతుంది ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణము అని చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి సోదరుల మధ్య తల్లిదండ్రుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. సంతనానికి సంబంధించిన విషయ వ్యవహారాలు వారి విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. వైద్య వృత్తి లో ఉన్నవారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు చాలా చక్కగా రాణించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. చేతిదాకా వచ్చిన కాంట్రాక్టులు చేజారి పోతాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పవచ్చు. పై అధికారుల వలన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది సమయాన్ని సద్వినియోగం చేసుకొని అనుకున్న విజయాలను సాధించగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా కలిసి వస్తుంది. మీరు చేసే సాంస్కృతిక కార్యక్రమాల వలన సంఘసేవ వలన మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నలుగురిలో మీరు చేసే కార్యక్రమాలు మెచ్చుకునే విధంగా ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోవడం వలన చేపట్టిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు లైట్ గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభరాశి ఫలితాలు
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యాపార రీత్యా కూడా కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది వివాహం కాని వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారానికి సంబంధించి అన్ని విషయాలు మీరే దగ్గరుండి చూసుకోవటం చెప్పదగిన సూచన. మీ పక్కన ఉన్న వారే మిమ్మల్ని మోసం చేశా అవకాశం లేకపోతే లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్థిరస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి గడచిన కాలం కంటే కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రేమ సంబంధిత విషయ వ్యవహారాలు ముఖ్యంగా ఆడవారితోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆడవారితో మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడటం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. చర్మ సంబంధించిన వ్యాధులు జీర్ణ సంబంధిత వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు మొదలగు వాటి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఆడవారికి స్పైన్ అండ్ న్యూట్రిషన్ సంబంధిత విషయాలలో ఇబ్బంది కలిగి అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తును ఉద్దేశించి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి చదువు మీద శ్రద్ధను ఇంకా పెంచాలి ఈ రాశి రోజు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అయినా అనుకున్న దాని కంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి ఫలితాలు
మీన రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోగలుగుతారు. చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చాలా కలిసి వస్తుంది. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది కానీ అందరికీ బాగుంటుంది లేదా అందరికీ బాగుండదు అనేది ఉండదు. ఈ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తరం స్తోత్రం పఠించడం అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం ద్వారా ఏలినాటి శని నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి అన్న విధంగా కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు చేతి దాక వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. ఎదుటివారి మాటలు నమ్మకుండా శ్రమతో పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో ముందుకు వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది. నలుగురిలో మనకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఉండాలనే భావనతో ముందుకు వెళ్ళండి కచ్చితంగా అనుకున్నది జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ వారికి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జీవిత భాగస్వామి ఒక ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించిన విషయాలలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారైతే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా సినీ కళా రంగాల వారికి సాఫ్ట్వేర్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంతవరకు బాగుంటుంది స్థిరాస్తులు అమ్మే వేరేచోట పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వారికి బాగా కలిసి వస్తుంది. ఈ వారం కావలసినంత ధనం చేతికి అందుతుంది కానీ ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ధన వ్యయం విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది మొహమాటానికి పోయి మోసపోకండి. ఈ రాశి వారికి ఎన్నడు లేనివిధంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. పొగడ్తలకు దూరంగా ఉండటం ప్రాక్టికల్ కు దగ్గరగా ఉండటం చెప్పదగిన సూచన. రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది చదువు మీద శ్రద్ధ పెట్టి అనుకున్న విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వతులతో దీపారాధన చేయటం అలాగే దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శని వారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.