Reading Time: 2 minutes
Mi Vs Kkr Toss Controversy Fans Question Toss Fairness After Mumbai Win

MI vs KKR Toss: ఐపీఎల్ 2026లో జరిగిన రెండో మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ పై అద్భుత విజయం అందుకుంది. 14 ఏళ్ల తర్వాత ఓ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్‌ లోనే విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌ లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీస్తోంది.

Jewellery Missing: ఛీ.. ఛీ.. మృతదేహాల నుంచి ఆభరణాలు కొట్టేయడం ఏంటయ్యా..?

మ్యాచ్ టాస్ సమయంలో జరిగిన అంశంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. టాస్ సమయంలో ముంబై కెప్టెన్ టాస్ వేయగా, అజంక్యా రెహానే టాస్ ను కాల్ చేశారు. కానీ నాణెం నేలపై పడిన తర్వాత అది హెడ్ వచ్చిందా..? లేదా టెయిల్ వచ్చిందా..? అని కెమెరాలో అసలు చూపించలేదు. నేరుగా ముంబై ఇండియన్స్ టాస్ గెలిచిందని కామెంటేటర్ ప్రకటించడంతో అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

PSL 2026 Ball Tampering: పాకిస్థాన్ లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్.. బజారున పీఎస్‌ఎల్ పరువు!

దీనితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఇది ‘టాస్ ఫిక్సింగ్’ అని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం “ఇలాంటి ఘటనలన్నీ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ ల్లోనే ఎందుకు జరుగుతాయి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు అయితే ఏకంగా ముంబై యాజమాన్యానికి ఇవి కామన్ అంటూ ఆరోపిస్తున్నారు. ఇక టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో కెప్టెన్ అజింక్య రహానే కూడా తాము బౌలింగ్ చేయాలనుకున్నామని అన్నారు. అయితే టాస్ తర్వాత మాట్లాడిన రహానే వాంఖెడే పిచ్ పరిస్థితులపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఇదివరకు ఎప్పుడు ఇక్కడ ఇంత గడ్డి ఉన్న పిచ్‌ను చూడలేదని, ప్రాక్టీస్ పిచ్‌ లతో ఇది పూర్తిగా భిన్నంగా ఉందని అన్నారు.