
కామరెడ్డి జిల్లాలోని గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలోని భావన రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లాల్తూ ర్ ముఖియా (21), రాహుల్ (21), జావీద్ అంసారి (22) అనే ముగ్గురు కార్మికులు ద్విచక్ర వాహనంపై గాంధారి వైపు వస్తుండగా రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించగా అప్పటికే ముగ్గురు యువకులు మృతి చెందారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్టలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం బాన్స్ వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.