Reading Time: < 1 minute

మయామి ఓపెన్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ టైటిల్‌.. సబలెంకకు రెండోసారి..

Caption of Image.

మయామి గార్డెన్స్‌‌‌‌: బెలారస్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అరీనా సబలెంక.. మయామి ఓపెన్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సబలెంక 6–2, 4–6, 6–3తో కోకో గాఫ్‌‌‌‌ (అమెరికా)పై గెలిచింది. 2022లో ఇగా స్వైటెక్‌‌‌‌ తర్వాత ఒకే సీజన్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ వెల్స్‌‌‌‌, మయామి ఓపెన్‌‌‌‌ గెలిచి ‘సన్‌‌‌‌షైన్‌‌‌‌ డబుల్‌‌‌‌’ సాధించిన తొలి ప్లేయర్‌‌‌‌గా సబలెంక రికార్డులకెక్కింది.

తాజా విజయంతో సబలెంక.. గాప్‌‌‌‌ఫై ముఖాముఖి రికార్డును 7–6కు పెంచుకుంది. 2 గంటలా 11 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో గాఫ్‌‌‌‌ తన బ్యాక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ షాట్లు చాలాసార్లు పక్కకు కొట్టడం మైనస్‌‌‌‌గా మారింది. ఓవరాల్‌‌‌‌గా సబలెంక కెరీర్‌‌‌‌లో ఇది 24వ ప్రొఫెషనల్‌‌‌‌ టైటిల్ కావడం విశేషం.

©️ VIL Media Pvt Ltd.