Reading Time: < 1 minute
Former Pakistan Army Chief Qamar Javed Bajwa Passes Away

పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా కన్నుమూశారు. రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బాజ్వా మరణవార్త పాకిస్తాన్ రాజకీయ, సైనిక వర్గాలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సైనిక అధికారులు తమ సంతాపం తెలిపారు. 2026 ఫిబ్రవరిలో బాత్రూంలో జారిపడటంతో ఆయనకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దేశ రాజకీయాలు, అధికారంపై ప్రగాఢ ప్రభావం కలిగిన బాజ్వా, పాకిస్తాన్ సైన్యంలో అత్యంత శక్తివంతమైన జనరల్స్‌లో ఒకరిగా నిలిచారు.

Also Read:Virat Kohli-SRH: ఎస్‌ఆర్‌హెచ్‌ అంటేనే ఊగిపోతున్న విరాట్ కోహ్లీ.. చివరి 5 ఇన్నింగ్స్‌లలో పరుగుల వరదే!

నవంబర్ 2016 నుండి నవంబర్ 2022 వరకు, దాదాపు ఆరేళ్లపాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా, కమర్ జావేద్ బాజ్వా తన సంపద, రాజకీయ ప్రకటనల కారణంగా వార్తల్లోనే నిలిచారు. తన పదవీకాలంలో భారీగా సంపదను కూడబెట్టారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇది పాకిస్తాన్‌లో రాజకీయ దుమారానికి కారణమైంది.

Also Read:Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

జనరల్ బాజ్వా పదవీకాలం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆయనను ఆర్మీ చీఫ్‌గా నియమించారు, కానీ తరువాతి సంవత్సరాలలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంతో ఆయన సంబంధాలు కూడా పరిశీలనకు గురయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడానికి సహాయపడ్డారని, తెరవెనుక నుండి అధికారాన్ని నియంత్రించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాజ్వా పదవీకాలంలో, భారతదేశంతో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి వంటి ప్రధాన సైనిక సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. బాజ్వా పదవీకాలంలో, పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలలో సైన్యం జోక్యంపై తరచుగా ప్రశ్నలు తలెత్తాయి.