
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా కాసేపట్లో వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు పోటీపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2012 తరువాత ముంబై తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు.. గత 14 ఏళ్లుగా దురదృష్టకర రికార్డును బ్రేక్ చేయాలని ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తోంది ఎంఐ.
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గాయాలు, ఆటగాళ్ల అందుబాటు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ముగ్గురు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారింది. ముస్తాఫిజుర్ రహ్మాన్ జట్టును విడిచిపెట్టగా, మతీషా పతిరణ, హర్షిత్ రాణా గాయాలతో జట్టుకి దూరమయ్యారు. హర్షిత్ రాణా సీజన్ మొత్తానికి దూరమవ్వగా, పతిరణ త్వరలో జట్టుతో కలిసే అవకాశం ఉంది. అలాగే ఆకాష్ దీప్ కూడా గాయంతో బయటకు వెళ్లడంతో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలహీనమైంది.
►ALSO READ | IPL 2026: అమీతుమీకి సిద్ధమైన ముంబై vs కోల్‌కతా.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే!
ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనింగ్ జోడీగా ఆరంభిస్తారు. మిడిల్ లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ లాంటి బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి బౌలర్లు జట్టుకు బలం చేకూరుస్తారు. ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు కొట్టే ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ పేరు ప్రచారం అవుతుంది. గత సీజన్‌లో అతను 717 పరుగులు చేసి అద్భుత ఫామ్ కనబరిచాడు.
అంతేకాదు, గత సీజన్‌లో 25 పరుగుల కంటే తక్కువ స్కోరుతో అవుట్ కాకపోవడంతో స్థిరత్వాన్ని మెంటైన్ చేశాడు. ఈ సీజన్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగించే ఛాన్స్ ఉంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం అతని ప్రత్యేకత.. ఇటీవల జరిగిన టోర్నీల్లో అతను పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ల విషయంలో ఇతర బౌలర్లకు అవకాశాలు కల్పించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతని స్పెల్స్ ముంబై విజయానికి కీలకంగా మారవచ్చు. మొత్తంగా ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ గాయాలు, బౌలింగ్ సమస్యలతో కొంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ, మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.