Reading Time: < 1 minute
Akhil Akkineni Lenin Movie Two Climaxes Sequel Hint Release Postponed

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’ ప్లాప్ తర్వాత తన పూర్తి ఫోకస్‌ను ‘లెనిన్’ సినిమాపైనే పెట్టారు. రాయలసీమ (చిత్తూరు) బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన ప్రయోగం చేస్తోందట.

Also Read :Pooja Hegde: బుట్టబొమ్మ రిటర్న్స్.. ‘జార్జ్ క్రిష్’ కోసం పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్!

ఈ సినిమా కోసం ఏకంగా రెండు రకాల క్లైమాక్స్‌లు షూట్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. మొదటి క్లైమాక్స్ పూర్తిస్థాయి మాస్ ఎలిమెంట్స్‌తో, అఖిల్ క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసేలా ఉంటుందని సమాచారం. ఇక రెండో క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. హీరో పాత్రలో గ్రే షేడ్స్ (Grey Shades) చూపిస్తూ, ఒక ఊహించని ట్విస్ట్‌తో ఈ క్లైమాక్స్ ముగుస్తుందని, అక్కడే సినిమా సీక్వెల్‌కు సంబంధించిన హింట్ కూడా ఇస్తారని తెలుస్తోంది. దీంతో ఈ రెండింటిలో ఏది ఫైనల్ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు, ఈ సినిమా విడుదల తేదీపై ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. వాస్తవానికి మే 1న విడుదల కావాల్సిన ‘లెనిన్’, రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ (ఏప్రిల్ 30) కోసం తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించేందుకు లెనిన్ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా జూన్ 26, 2026న గ్రాండ్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.