
Hardik Pandya: మరి కాసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ లో జరగనున్న రెండవ మ్యాచ్ కి ముందు ముంబై ఇండియన్స్ నాయకుడు హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై వీధుల్లో సుమారు 12 కోట్ల రూపాయల విలువైన తన కొత్త ‘ఫెరారీ’ కారును నడుపుతూ అతను కనిపించాడు. స్పీడ్ బ్రేకర్లను దాటే సమయంలో కారుకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా పాండ్యా పాటించిన ప్రత్యేక పద్ధతి అందరినీ ఆకట్టుకుంది. కారును నేరుగా పోనివ్వకుండా, కాస్త ఏటవాలుగా తిప్పుతూ అత్యంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాడు. అనంతరం అక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసు అధికారులతో ముచ్చటిస్తూ కనిపించాడు. దీంతో నెట్టింట కొందరు యూజర్లు పోలీసులకి హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ తో చిక్కిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన ఒక శుభవార్త అందింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా జట్టుతో తిరిగి చేరి, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడని ప్రధాన కోచ్ మహేలా జయవర్థనే ప్రకటించారు. గతంలో బుమ్రా పని భారాన్ని తగ్గించేందుకు జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ప్రీ–-మ్యాచ్ సమావేశంలో మాట్లాడిన జయవర్ధనే, బుమ్రా ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని, మ్యాచ్ ఆడేందుకు అందుబాటులో ఉన్నాడని స్పష్టం చేశారు.
►ALSO READ | Sehwag vs Ashwin: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఫాలోవర్స్ తగ్గిపోతారు.. సెహ్వాగ్, అశ్విన్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్
జయవర్ధనే మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన వరల్డ్ టీ20 టోర్నమెంట్ కారణంగా ఆటగాళ్లపై భారీ పని భారం పడింది. ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి అవసరం, అందుకే వారి ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. వరల్డ్ టోర్నీ సమయంలో ప్రయాణాలు, మ్యాచ్‌ల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లపై ప్రభావం పడిందని వివరించారు. ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో బలమైన లైనప్‌తో బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి బ్యాటర్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఇక బుమ్రా తిరిగి అందుబాటులోకి రావడం ముంబై జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో అతడి రాక జట్టుకి అదనపు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనుంది.
🚨NICE GESTURE BY HARDIK PANDYA WITH POLICE OFFICER🚨
– Hardik struggled with huge speed breakers in his ₹12 crore Ferrari 😭
Had to cross them at an angle, got a bit frustrated, Still stopped ahead to greet police officers with a handshake 👏🔥 pic.twitter.com/0vhdYPvWAc
— Sam (@Cricsam01) March 28, 2026