Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ రికార్డులు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన ఈ మూవీ తాజాగా మరో అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బాహుబలి 2 రికార్డును ధురందర్ 2 మూవీ బద్దలు కొట్టింది.

ప్రభాస్, ఎస్.ఎస్. రాజమౌళి వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ పేరిట ఉన్న చిరకాల రికార్డును బద్దలు కొట్టి.. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కేవలం 9 రోజుల్లోనే $20.80 మిలియన్ల మార్కును దాటి, ఉత్తర అమెరికా మార్కెట్‌లో ‘బాహుబలి 2’ జీవితకాల వసూళ్ల రికార్డును అధిగమించింది.  2017లో విడుదలైన బాహుబలి 2, ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో $20.80 మిలియన్ల వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ధురందర్ 2 మూవీ $21 మిలియన్స్ మార్క్ ను చేరుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,226 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.