Reading Time: < 1 minute

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్రారం గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. ఆదివారం ఉదయం ధర్మారం గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు మూడుకే లక్ష్మిరాజం (58), కుమ్మం మొండయ్య (50)లు గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువులోకి తీసుకువెళ్లారు. చెరువులోపలికి వెళ్లిన మూడు గొర్రెలను బయటకు తీయడానికి వెళ్లిన కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేశాలను వెలికి తీశారు. ఈ మేరకు కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు గొర్రెల కాపరుల ఆకస్మిక మృతితో ధర్మారంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాల రోదనలు పలువురికి కన్నీళ్లు తెప్పించాయి.