
మంత్రి పొంగులేటి పై చర్యలు తీసుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మంత్రి కంపెనీ అవినీతికి పాల్పడ్డారని డిఫెన్స్ చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే అసెంబ్లీలో ఆయనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో వేటు వేయాల్సి వస్తే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ ఎస్ సభ్యులకు మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమలేదన్నారు హరీష్ రావు. దళితులపై ప్రేమ ఉంది బీఆర్ ఎస్ కు మాత్రమే..అందుకే దళిత బంధు ఇచ్చామన్నారు. దళితులకోసం కాంగ్రెస్ ఏం ఇచ్చిందో చెప్పాలన్నారు. దళితబంధుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు హరీష్ రావు. ఎస్సీ డిక్లరేషన్ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
►ALSO READ | కమిషన్లకోసమే కాళేశ్వరం కట్టారు.. పదేండ్లు ప్రజాధనం వృధా చేశారు: ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి