
హైదరాబాద్: ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చాం’’ అని సభలో తెలిపారు.
‘‘వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చింది. కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరం. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్ిని సామాజికంగా బహిష్కరించాలి. తల్లిదండ్రులను చూసుకోలేనివాడు సమాజంలో బతకడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులకు కూడా చట్టం వర్తిస్తుంది’’ అని సిఎం అన్నారు.