Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎక్స్ కావేటర్ అనేది చెరువు అడుగుభాగంలో పూడికతీత, డ్రెడ్జింగ్ పనులు, కట్టలను బలోపేతం చేయడం, నీటి కలుపు మొక్కల తొలగింపు , శిధిలాలు, బురద తొలగింపు , పాత చెరువుల పునరుద్ధరణ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పివి మార్గ్ లో సంజీవయ్య పార్క్ సమీపంలో హెచ్ఎండిఎ ఆధ్వర్యంలో నూతనంగా చెరువుల పూడికతీత , కలుపు మొక్కల తొలగింపు కోసం తీసుకొచ్చిన అధునాతన ఎక్స్ కావేటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కూకట్‌పల్లి నాలా, సరస్సులోని ఇతర ప్రదేశాలలో నీటి కలుపు మొక్కల తొలగింపు, డ్రెడ్జింగ్, పూడికతీతకు దీనిని ఉపయోగిస్తారని వివరించారు. గణేశ విగ్రహ నిమజ్జనం, దుర్గా విగ్రహ నిమజ్జనం, బతుకమ్మ, ఛత్ పూజ, ఇతర కార్యక్రమాల వంటి పండుగల సమయంలో సమర్థవంతమైన దీనిని వినియోగించవచ్చని తెలియజేశారు. ప్రతి షిఫ్ట్‌కు ఒక నైపుణ్యం గల ఆపరేటర్, ఒక పాక్షిక నైపుణ్యం గల ఆపరేటర్ ప్రాతిపదికన సర్వీస్ ఇంజనీర్‌ను ఉంటారని పొన్నం పేర్కొన్నారు.