Reading Time: 2 minutes

Phil Salt: సాల్ట్ మావా, ఇంతకీ నువ్వు మనిషివా లేక పక్షివా?.. గాల్లో క్యాచులు పట్టేది అలాగేనా!

Caption of Image.

Phil Salt: ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో క్రికెట్ అభిమానులని మైమరిపించాడు. మొత్తం మూడు క్యాచ్‌లు పట్టిన అతడు.. రెండు క్యాచులని అయితే మామూలుగా పట్టలేదనుకోండి. ముఖ్యంగా SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సింగిల్ హ్యాండ్‌తో పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీజన్‌లోనే ది బెస్ట్ క్యాచ్‌గా నిలిచిపోనుంది. అంతకుముందు హెన్రీచ్ క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను సైతం బౌండరీ లైన్‌పై దగ్గర సాల్ట్ అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ముఖ్యంగా బౌండరీ లైన్‌ను టచ్ చేయకుండా తన శరీరాన్ని సరి చేసుకున్న తీరు అద్భుతం. సాల్ట్ క్యాచ్‌లతోనే ఈ మ్యాచ్‌లో SRH పతనాన్ని శాసించాడు. ఇషాన్, క్లాసెన్‌, ట్రావిస్ హెడ్ క్యాచ్‌లను కూడా సాల్ట్ అందుకున్నాడు.

విధ్వంసకర బ్యాటింగ్‌తో శతకం దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్ కొట్టిన బంతిని ఫిల్ సాల్ట్ అసాధారణ క్యాచ్‌తో నిరాశగా డగౌట్ కి చేరాడు. డెబ్యూ పేసర్ అభినందన్ సింగ్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ చివరి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ ఫుల్‌టాస్‌గా వేయగా.. కిషన్ గాల్లోకి లేపాడు. పాయింట్ బౌండరీ నుంచి వేగంగా వచ్చిన సాల్ట్ మావా.. ఫుల్ స్ట్రెచ్‌తో సింగిల్ హ్యాండ్‌తో ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌కు ఇషాన్ కిషన్‌తో పాటు ఆర్‌సీబీ ప్లేయర్స్ అందరూ నోరెళ్లబెట్టారు. కామెంటేటర్లతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. జితేశ్ శర్మ అయితే మైండ్ బ్లోయింగ్ అంటూ సాల్ట్‌ను ప్రశంసించాడు. అభిమానులు సైతం వాటే ఏ క్యాచ్, మైండ్ బ్లోయింగ్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. 

►ALSO READ | Virat Kohli: సింపుల్ క్యాచ్ మిస్ చేసిన కోహ్లీ.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 రన్స్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనికేత్ వర్మ(43), హెన్రీచ్ క్లాసెన్ (31) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో SRH భారీ స్కోర్ సాధించింది. ఇక ఆర్‌సీబీ బౌలర్లలో జాకాబ్ డఫీ(3), రొమారియో షెఫెర్డ్(3) తలో మూడు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ పటగొట్టారు. 

©️ VIL Media Pvt Ltd.