మారుతున్న జీవనశైలితో నేడు హృదయ సంబంధిత సమస్యలు అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా యువతలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. గుండెపోటు వంటి తీవ్రమైన పరిణామాలను నివారించడానికి సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవశ్యకం. ధమనులను శుభ్రపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని సమర్థవంతమైన సహజ పరిష్కారాలను అందిస్తున్నారు వైద్యులు.
గుండె సమస్యలను ముందుగా గుర్తించడం: డాక్టర్ సలహా మేరకు, 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కనీసం పది సంవత్సరాలకు ఒకసారి సీటీ యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా గుండె ధమనులలోని బ్లాకులను ముందుగానే గుర్తించవచ్చు. ఇది కేవలం 15 నిమిషాల్లో పూర్తయ్యే బాధారహిత ప్రక్రియ. ఈ పరీక్ష ఫలితాలను బట్టి తగిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు.
గుండె సమస్యలకు కారణాలు: అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం నియంత్రణ లోపం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటివి గుండె సమస్యలకు ప్రధాన కారణాలు. ఈ సమస్యలను అధిగమించడానికి, రాకుండా నివారించడానికి సహజసిద్ధమైన ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 200 మి.లీ. సొరకాయ రసం తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించి, బరువును నియంత్రించి, గుండె బ్లాకులను తొలగించడంలో సహాయపడుతుంది. మరొకటి 200 మి.లీ. బూడిద గుమ్మడికాయ రసం తీసుకోవాలి. ఇది కూడా శరీరానికి అమృతంలా పనిచేసి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
200 మి.లీ. దోసకాయ రసం తీసుకోవాలి. ఈ మూడు జ్యూసులను వరుసగా మూడు వారాలు తీసుకోవాలి. తీవ్రమైన సమస్యలు ఉన్నవారు రోజుకు రెండు లేదా మూడు సార్లు కూడా తీసుకోవచ్చు. ఈ కోర్సును ఆరు నుండి తొమ్మిది వారాల వరకు కొనసాగించడం వల్ల 30-40% బ్లాకులు క్లియర్ అవుతాయి.
దాల్చినచెక్క (సిన్నమన్) టీ: దాల్చినచెక్కను బిర్యానీలో మసాలాగా ఉపయోగిస్తారు. అయితే, ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను నీటిలో వేసి మరిగించి, ఆ డికాక్షన్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండె బ్లాకులు తొలగి, గుండె పంపింగ్ సామర్థ్యం పెరుగుతుంది. సాధారణ టీకి బదులుగా సాయంత్రం దాల్చినచెక్క టీ తీసుకోవాలని తెలుపుతున్నారు డాక్టర్లు.
అర్జున బెరడు డికాక్షన్: అర్జున బెరడు (అర్జున చాల్) గుండె రోగులకు ఒక “రామబాణం” వంటిది. ఇది చాలా తక్కువ ధరలో ఆయుర్వేద షాపులలో లభిస్తుంది. ఒక చిన్న బెరడు ముక్కను నీటిలో వేసి మరిగించి ఉదయం పూట డికాక్షన్ తాగాలి. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించి, గుండె బ్లాకులను నివారిస్తుంది. పిల్లలకు గుండె సమస్యలు ఉంటే, అర్జున బెరడు, దాల్చినచెక్క పొడిని పాలలో మరిగించి ఇవ్వడం వల్ల వారి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గ్రీన్ డిటాక్స్ జ్యూస్: శరీరాన్ని శుభ్రపరచడానికి (డీటాక్స్) కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మెంతికూర, రెండు తమలపాకులు, ఒక పచ్చి ఆపిల్‌తో కలిపి జ్యూస్ చేసుకోవాలి. దీనిని మధ్యాహ్నం 11 లేదా 12 గంటలకు ఒకసారి లేదా రెండుసార్లు తీసుకోవడం వల్ల షుగర్, బీపీ అదుపులోకి వచ్చి, మొత్తం శరీరం ఆరోగ్యంగా మారుతుంది.
కరివేపాకు డికాక్షన్ అధిక రక్తపోటు కోసం: అధిక రక్తపోటు నియంత్రణకు కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక కప్పు కరివేపాకును వేడి నీటిలో వేసి, ఒక గ్లాసు నీరు అర గ్లాసు అయ్యే వరకు మరిగించి, ఉదయం, సాయంత్రం తాగడం వల్ల 10 రోజుల్లోనే రక్తపోటు 25-40% తగ్గుతుందనితెలుపుతున్నారు. ఇది మందుల వాడకాన్ని తగ్గించి కిడ్నీ, కడుపు సమస్యలను నివారిస్తుంది.








