Reading Time: 2 minutes
Cag Report Telangana Psus Losses Singareni Diesel Irregularities 2023

CAG report Telangana: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై CAG నివేదిక విడుదలైంది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కంప్రోల్టర్ అండ్ ఆడిటింగ్ జనరల్ (CAG) కీలక వ్యాఖ్యలు చేసింది. 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కీలక సమాచారం వెలువడింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. వాటిలో 16 సంస్థలు మూతపడినవి లేదా లిక్విడేషన్‌లో ఉన్నట్టు వెల్లడైంది. 67 పని చేస్తున్న సంస్థల్లో 49 సంస్థలు ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేశాయి. కేవలం 18 సంస్థల పనితీరే విశ్లేషణకు తీసుకున్నట్టు CAG తెలిపింది. ఈ 18 సంస్థల టర్నోవర్ రూ.95,204 కోట్లుగా నివేదిక చెబుతోంది. 18 సంస్థల్లో 11 నష్టాల్లో, కేవలం 6 సంస్థలు లాభాల్లో ఉన్నాయి. మొత్తం పెట్టుబడులు రూ. 98,572 కోట్లుగా నమోదయ్యాయి. 9 సంస్థల నెట్‌విలువ పూర్తిగా నష్టాలతో కరిగిపోయింది. మొత్తం నెట్‌విలువ రూ.-50,930 కోట్లుగా తగ్గింది. 71 సంస్థలు సమయానికి ఖాతాలు సమర్పించకపోవడంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. 15 సంస్థల్లో 9 సంస్థలు స్వతంత్ర డైరెక్టర్ల నియామకం చేయలేదు. ఎక్కడా ఇండిపెండెంట్ డైరెక్టర్ల సమావేశాలు నిర్వహించలేదు. 5 సంస్థల్లో ఆడిట్ కమిటీ లేకపోవడం గమనార్హం. 9 సంస్థల్లో NRC కమిటీ ఏర్పాటు కాలేదు.

READ MORE: BRS MLCs Suspended: శాసన మండలి హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మూకుమ్మడి సస్పెన్షన్!

అలాగే.. సింగరేణి కంపెనీపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. డీజిల్ వినియోగంలో భారీ వ్యత్యాసాలు గుర్తించింది. కాగ్ నివేదిక ప్రకారం.. కొన్ని ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ వినియోగం జరిగింది. కాంట్రాక్టుల్లో లోపాల వల్ల రూ. 251 కోట్ల అనవసర ఖర్చులు చేశారు. ఒప్పంద నిబంధనలు అమలు కాక రూ.74 కోట్ల అదనపు భారం పడింది. కోల్ రవాణాలో లోపాలు రూ. 25 కోట్ల నష్టం వాటిల్లింది. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల వల్ల రూ. 1,078 కోట్ల అదనపు వసూళ్లు జరిగాయి. పర్యావరణ నిబంధనలు పాటించకలేదు. కాంట్రాక్టర్లు ఎఫ్లువెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరు సమీక్షించాలి. ఖాతాలు త్వరగా పూర్తి చేయాలని కాగ్ సూచించింది. మూతపడిన సంస్థలపై పునరుద్ధరణ లేదా మూసివేతపై నిర్ణయం అవసరమని పేర్కొంది. డీజిల్ వినియోగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టుల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని నివేదిక స్పష్టం చేసింది.