పవర్ వాటేన్ను చెక్ చేయండి: ఇండక్షన్ ఎంత వేగంగా వంట చేస్తుందనేది దాని వాటేజ్పై ఆధారపడి ఉంటుంది.. కాబట్టి మీరు ఇండక్షన్ స్టవ్ కొనే ముందు దీన్ని కచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు ఇన్స్టంట్ వంట చేసుకునేవారు అయితే మీకు 1200W నుండి 1500W సరిపోతుంది. కానీ మీరు రోజూ దీనిపైనే వంట చేసుకోవాలి అనుకుంటే మీరు కచ్చింతగా 1800 నుండి 2000W ఉన్న స్టవ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల వంట త్వరగా, సాఫీగా అవుతుంది.
స్టవ్ పరిమాణం: మీ వంటగదిలోని ఖాళీ స్థలం, మీ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మీరు స్టవ్ సైజును ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉన్నా లేదా మీ ఇంట్లో ఒకటి లేదా ఇద్దరు వ్యక్తుల కోసం మాత్రమే వంట చేయాలి అనుకుంటే.. మీకు ఒక చిన్న కుక్‌టాప్ సరిపోతుంది. కానీ మీ పెద్ద కుటుంబం అయితే, మీరు చాలా మంది వంటి చేయాల్సి ఉంటే ఉపరితలం పెద్ద స్టవ్‌ను మీరు తీసుకోవాలి. ఇది ఎక్కవ మందికి వంట చేసేందుకు సులభంగా ఉంటుంది.
ప్రీసెట్ కుకింగ్ మోడ్స్: చాలా ఇండక్షన్లలో పాలు కాచడం, ఫ్రై, కర్రీ, రైస్ వంటి ఆప్షన్లు ముందే సెట్ చేసి ఉంటాయి. ఈ మోడ్ల వల్ల వంట చేయడం సులభం అవుతుంది, ఎందుకంటే మీరు సెట్టింగ్‌లను పదే పదే మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ముఖ్యంగా ఇండక్షన్ కొత్తగా వాడేవారికి ఈ ఫీచర్లు చాలా బాగా ఉపయోగపడతాయి.
భద్రతా ఫీచర్లు: భద్రత విషయంలో ఇండక్షన్ చాలా మేలైనది. కొనే ముందు ఈ ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. ఆటో షట్-ఆఫ్ ఈ ఫీచర్స్ పాత్ర తీసేయగానే ఆటోమేటిక్‌గా స్టవ్‌ను ఆఫ్ చేస్తుంది. ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్, ఈ ఫీచర్ వల్ల వేడి మరీ ఎక్కువైతే స్టవ్ ఆగిపోతుంది. చైల్డ్ లాక్, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది.
పాత్రల ఎంపిక: ఇండక్షన్‌పై అన్ని రకాల పాత్రలు పనిచేయవు. కేవలం ఫ్లాట్ బాటమ్ ఉన్న స్టీల్ లేదా ఐరన్ పాత్రలతో మాత్రమే దీనిపై వంట చేయగలం. కాబట్టి మన ఇంట్లో ఉన్న పాత్రలు ఇండక్షన్ స్టవ్‌పై వంట చేయడానికి పనికి వస్తాయో లేదా అయస్కాంతం ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా అయస్కాంతం పాత్ర అడుగున అతుక్కుంటే, అది ఇండక్షన్‌పై పనిచేస్తుందని అర్థం.
బడ్జెట్, బ్రాండ్: మీరు ఇండక్షన్ కొనాలి అనుకుంటే బడ్జెట్‌తో పాటు బ్రాండ్‌ను కూడా చూడడం ఎంతో ముఖ్యం. సాధారణంగా నర్మల్ ఇండక్షన్ కుక్‌టాప్‌లు సుమారుగా రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు దొరుకుతాయి. అదే మీకు అప్డేటెడ్ ఎక్కువ ఫీచర్లు ఉన్నవి కావాలి అనుకుంటే రూ. 5,000 వరకు ఉండవచ్చు. మంచి సర్వీస్, వారంటీ ఇచ్చే నమ్మకమైన బ్రాండ్‌ను ఎంచుకోవడం ఎప్పుడూ మంచిది.





