
హైదరాబాద్: ఎంఎల్ఎ దానం నాగేందర్ కు సంబంధించిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఓ బిల్డర్ ను రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని దానం బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైన్ అనే బిల్డర్ ను దానం ఫోన్ చేసి బెదిరించడంతో రూ.25 లక్షలు ఇస్తానని అతడు చెప్పాడు. దీంతో తాను 25 లక్షలు తీసుకొని వాడిలా కనిపిస్తున్నానా బిల్డర్ ను దానం బెదిరించారు. రెండు కోట్లు రూపాయలు ఇవ్వాలని దానం నాగేందర్ డిమాండ్ చేసినట్టుగా గొంతు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించని ఆడియో వాట్సాప్ గ్రూపులలో వైరల్ గా మారింది.