Reading Time: < 1 minute

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల పెంపుపై పేరెంట్స్ ఆందోళనలు

Caption of Image.

ప్రైవేట్ స్కూల్ ఫీజులు మధ్యతరగతి జనాలకు తలకు మించిన భారంగా  మారుతున్నాయి. ఏటా పెరుగుతున్న స్కూల్ ఫీజులు సగటు మధ్యతరగతి తల్లిదండ్రులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు. పిల్లలను చదివించడం అనేది బాధ్యతగా కాకుండా జీవితాశయంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో స్కూల్ ఫీజుల పెంపుపై ఆందోళన చేపట్టారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లోని సిద్దార్థ పబ్లిక్ స్కూల్ దగ్గర ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు పేరెంట్స్. అడ్మిషన్ సమయంలో స్కూల్ యాజమాన్యం  తెలిపిన ప్రకారం ప్రతి ఏడాది 5 శాతం మేరకే ఫీజులు పెంచాల్సీ ఉండగా… 15 శాతం మేర స్కూల్ ఫీజులు పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు.

►ALSO READ | మైనింగ్ వ్యవహారాలపై శాసన మండలిలో రచ్చ… బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ 

ఫీజు కట్టడం కాస్త లేట్ అయినా కూడా పెనాల్టీ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల తీరుతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని అంటున్నారు పేరెంట్స్. 

పెంచిన ఫీజులు తగ్గిస్తామంటూ స్కూల్ యాజమాన్యం హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు తల్లిదండ్రులు.అయితే..స్కూల్ యాజమాన్యం మాత్రం ఏడు నుండి ఎనిమిది శాతం మాత్రమే స్కూల్ ఫీజు  పెంచామని అంటోంది.
 

©️ VIL Media Pvt Ltd.