Reading Time: < 1 minute
Why Cameron Green Didnt Bowl Rahanes Answer Sparks Buzz After Mi Vs Kkr Clash

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘోర పరాజయం చవిచూసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (78), ర్యాన్‌ రికెల్టన్‌ (81) తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పారు. దీంతో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. ముంబై బ్యాటర్లు ప్రతి ఒక్కరు చితకొట్టారు. దాంతో కేకేఆర్ బౌలింగ్ లోపం స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం పెద్ద చర్చకు దారితీసింది.

25.20 కోట్లు పెట్టి కొన్నా కూడా కామెరూన్ గ్రీన్ ఒక్క ఓవర్ బౌలింగ్ చేయకపోవడంతో ఫాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. అతడితో కోల్‌కతా ఎందుకు బౌలింగ్‌ చేయించలేదని సందేహం అభిమానులకు వచ్చింది. ఇదే ప్రశ్నను కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను అడగ్గా.. ‘ఈ ప్రశ్నను క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి’ అంటూ ఆసక్తిర సమాధానం (నవ్వుతూ) ఇచ్చాడు. గ్రీన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, మరో రెండు వారాల్లో అతడు బౌలింగ్ చేస్తాడని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా స్పష్టత ఇచ్చింది. గ్రీన్‌కు నడుం భాగంలో గాయం అయిందని, అందుకే మొదటి 10 నుంచి 12 రోజుల పాటు బౌలింగ్ చేయకుండా విశ్రాంతి ఇవ్వాలని ముందుగానే కేకేఆర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.

Also Read: Sunil Narine History: ఐపీఎల్‌లో మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ రేర్ రికార్డు!

ఇప్పటికే గాయాల కారణంగా పేసర్లు హర్షిత్ రాణా, మతీశ పతిరానా దూరమవ్వగా.. ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ విడిచిపెట్టింది. ఈ పరిస్థితుల్లో కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయలేకపోవడం కేకేఆర్‌కు మరింత సమస్యగా మారింది. గాయం కారణంగా గ్రీన్ కొన్ని మ్యాచ్‌లలో కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడే అవకాశముంది.హైదరాబాద్, పంజాబ్, లక్నోతొ జరిగే మ్యాచ్‌ల్లో అతను బౌలింగ్ చేయకపోవచ్చు. ఏప్రిల్ 9 తర్వాత గ్రీన్ పూర్తిస్థాయిలో తిరిగి బౌలింగ్ చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి గ్రీన్ గాయం కారణంగా కేకేఆర్ బౌలింగ్ విభాగం దెబ్బతిన్నది. ఈ సమస్యను అధిగమిస్తూ కేకేఆర్ ఐపీఎల్ 2026లో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.